Dinesh Karthik : దినేష్ కార్తీక్.. ఈ పేరు క్రికెట్ ఫ్యాన్స్‌కి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తన కెరీర్‌లో అనేక దశలను చూశాడు. ఒక దశలో, అతను భారత జట్టులో స్ట్రాంగ్ కీపర్ , బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. దురదృష్టవశాత్తు, అతను జాతీయ జట్టులో కోల్పోగా, తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు..అంతర్జాతీయ కెరీర్‌లో, అతను ఒక సెంచరీ మరియు 14 అర్ధ సెంచరీలు చేశాడు.కృష్ణకుమార్ దినేష్ కార్తీక్ 1985 జూన్ 1వ తేదీన చెన్నైలో తెలుగు నాయుడు (కాపు) కుటుంబంలో జన్మించారు. కార్తీక్ తండ్రి కృష్ణ కుమార్ యవ్వనంలో చెన్నైలో ఫస్ట్-డివిజన్ క్రికెట్ ఆడాడు, అయితే అతని తల్లిదండ్రుల బలవంతం వలన చదువుపై కాన్సన్‌ట్రేషన్ ఎక్కువగా చేయవలసి వచ్చింది.అతను అంతర్జాతీయ క్రికెటర్ కాకపోయిన కుమారుడిని మాత్రం చేశాడు.
దినేష్ కార్తీక్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. యాంకర్ వింధ్య అతనితో తెలుగులో మాట్లాడుతుండగా, దినేష్ కూడా చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తన తండ్రి నుండి తనకు తెలుగు వచ్చిందని దినేష్ చెప్పుకురావడం విశేషం. ప్రస్తుతం దినేష్ కార్తీక్ తెలుగులో మాట్లాడిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే దినేశ్ కార్తీక్ తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని చాటి చెబుతున్నాడు. పేలవ ఫామ్‌తో ఐపీఎల్ 2023లో ఇబ్బంది పడిన 38 ఏళ్ల డీకే తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. తమిళనాడు తరుపున ఆడుతున్న దినేశ్ కార్తీక్ పరుగుల వరద పారిస్తున్నాడు. బరోడా పై 51 బంతుల్లో 68 పరుగులు చేసిన కార్తీక్ తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచులో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ముంబైలోని ఎంసీఏ గ్రౌండ్‌లో శుక్రవారం పంజాబ్, తమిళనాడు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. మన్‌దీప్ సింగ్ (68),ప్రభసిమ్రాన్ సింగ్ (58), అభిషేక్ శర్మ (38) లు రాణించడంతో పంజాబ్ 45.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో తమిళనాడు జట్టు 95 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దినేశ్ కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఒంటరి పోరాటం చేశాడు. తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. దినేశ్ కార్తీక్ మినహా మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో తమిళనాడు 34.2 ఓవర్లలో 175 పరుగులకు పరిమితమైంది. దీంతో పంజాబ్ జట్టు 76 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…