టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న దిల్ రాజు ఇప్పుడు నిర్మాతగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో దిల్ రాజు తన రెండవ పెళ్లి గురించి రివీల్ చేశారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించగా, ఆ తర్వాత రెండేళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు 2020లో తేజస్వినిని వివాహం చేసుకున్నాడు. అయితే మొదటి భార్య మరణం తర్వాత దిల్ రాజు చాలా బాధలు అనుభవించాడు. నా భార్య మరణించినప్పుడు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యా. జీవింతంలో ముందుకి వెళ్ళాలనిపించినప్పుడు రెండు మూడు ఆప్షన్స్ కూడా కనిపించాయి. నాకు కూడా ఒక తోడు ఉంటే బావుంటుంది అనిపించింది. ఆ సమయంలో తేజస్వినితో పరిచయం జరిగింది. ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ఏడాది పాటు తేజస్వినిని గమనించా. ఆ తర్వాత నేనే ఆమెకి ప్రపోజ్ చేశాను. ఇంట్లోవాళ్ళు కూడా మా వివాహానికి అంగీకరించారు. ప్రస్తుతం మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అంటూ దిల్ రాజు లవ్ స్టోరీ రివీల్ చేశారు.
మొత్తానికి దిల్ రాజు తన రెండో భార్యతోను చక్కని వైవాహికి జీవితం కొనసాగిస్తుండగా, మరోవైపు కెరీర్‌లోను దూసుకుపోతున్నాడు. దిల్ రాజు ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇవే కాక పలు పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే దిల్ రాజుకి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు ఉంది. ఇటీవల పెద్దగా సక్సెస్‌లు చవిచూడడం లేదు. భారీ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…