సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో కోడి పందేల హంగామా ఏ రేంజ్‌లో ఉంటంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తూ వస్తుండగా.. దానిపై కోట్లలో బెట్టింగ్ కూడా జరుగుతుంది.. అయితే మూగ జీవాలను హింసించడం పాపమంటూ ఈ కోడి పందేలపై ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉన్నా కూడా అటు సంప్రదాయాలను పాటించే వారి మనోభావాలు దెబ్బతీయకుండా, ఇటు మూగ జీవాల గురించి ఆలోచిస్తూ.. తీర్పును ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఎంతో తర్జనభర్జన పడుతుంటాయి. అయితే ఇదొక్కటే కాదు.. తమిళనాడులో జరిగే జల్లికట్టు సంప్రదాయానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతుంటాయి.
మూగజీవాలని హించే వాటికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు యాంకర్ రష్మి. మూగ జీవాలను హింసించడం పాపమంటూ మొదటి నుంచి అందరిలో అవేర్‌నెస్ ఇస్తూ వస్తోన్న రష్మి.. తాజాగా కోడి పందేలపై స్పందించారు. తాను కోడి పందేలకు వ్యతిరేకమని , ఇది చట్టబద్దం కాదని, మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక మూగజీవిని అలా హింసించకూడదని రష్మి తెలిపింది. కంట్లో కారం పెట్టి, వాటిని ఇబ్బంది పెట్టడం చాలా తప్పని, అస్సలు అది మానవత్వం అనిపించుకోదని ఆమె చెప్పుకొచ్చింది. తన స్టేట్‌మెంట్ వలన చాలా మంది హర్ట్ అవ్వొచ్చని.. వారు ఎలా అనుకున్నా ఇబ్బంది లేదని, కానీ తాను మాత్రం వాటికి వ్యతిరేకతమని చెప్పింది.
తాజాగా ఒక డాక్టర్ తాను కోడిపందాలు వేశానని అందులో రెండు పందాలు తాను గెలిచాను అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.. దీంతో గుల్షన్ అనే ఒక తెలుగు నెటిజన్ ఇదే ట్వీట్ జల్లికట్టు మీద వెయ్యి, తమిళనాడు వాళ్ళు వచ్చి చెప్పు తెగేలా కొడతారు, మా తెలుగు వాళ్ళ వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, మా సంప్రదాయాల మీద ఏడుపు ఏడిస్తే చెప్పుతో కొడతారు అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన రష్మీ ఏ సంప్రదాయం కాళ్లకు కత్తులు కట్టి జంతువులను హానిపరచమని చెప్పింది? ఏ సంప్రదాయం వాటికి మందు పట్టించి కారంతో వాటిని రెచ్చగొట్టమని చెప్పింది? వాటికి హాని జరగనంత వరకు ఏదైనా ఒప్పుకోవచ్చు, ఏదైనా జంతువుకి హాని కలిగితే దాన్ని వెనకేసుకు రాకండి కావాలంటే మీ వాయిస్ జరుగుతున్న తప్పులు మీద పెంచండి అని అతనికి సలహా ఇచ్చింది రష్మీ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…