Dil Raju : విజయ్, మృణాల్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మూవీపై భారీ అంచనాలు ఉండగా, ఈ మూవీ ఫ్లాప్ అని టాక్ నడిచింది. ఇందులో పాత్రలు తప్పితే మరో పాత్ర ఎలివేట్ అయినట్టు ఎక్కడా అనిపించదు. సినిమా మొత్తాన్ని విజయ్ తన భుజాలపై మోసి.. వన్ మ్యాన్ షోతో చూపించాడు. గత సినిమాలతో పోల్చుకొంటే.. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బెటర్‌గా, మెచ్యుర్డ్‌గా కనిపించింది. ఫైట్స్, డ్యాన్సులతో కొత్తగా కనిపించాడు. మృణాల్ పాత్ర ఫెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ లేకపోయింది. బలహీన కథతో చేసిన ప్రయోగంలా అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు.
ఈ నెల 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ చిత్రం రివ్యూలపై నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఒకలా ఉందని.. సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిదికాదన్నారు. ఓ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదంటే ఆ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని, కానీ ఓ మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. “తల్లిదండ్రులు, తాతలు, బామ్మలు… ఇలా ఈ సినిమా చూసినవాళ్లందరూ బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా రీచ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.
దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే… మేం మంచి సినిమానే తీశాం. మీరు థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చితే నలుగురికి చెప్పండి… నచ్చలేదంటే ఆ విషయాన్ని మేం కూడా అంగీకరిస్తాం. కానీ, ఇప్పుడీ సినిమాను చూసిన వారు నాకు మెసేజ్ లు పంపిస్తున్నారు, కొందరు కాల్ చేస్తున్నారు. కొందరు నన్ను కలిసి మాట్లాడారు… ఈ సినిమా బాగుంది, బయట ఎందుకింత నెగెటివ్ ప్రచారం ఉంది? అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగుందంటున్నారు… మీరు కూడా థియేటర్లకు వెళ్లి చూసి ఆస్వాదించండి” అని వివరించారు. కాగా, ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్ రాజు ఓ థియేటర్ కు వచ్చి వీక్షించారు. అంతేకాదు, సినిమాకు వచ్చిన ప్రేక్షకులతో స్వయంగా మాట్లాడి పబ్లిక్ టాక్ తెలుసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…