Dil Raju : థియేట‌ర్ల‌కు రాకుండా ప్రేక్ష‌కుల‌ను మేమే చెడ‌గొట్టాం.. దిల్‌రాజు సంచ‌ల‌న కామెంట్స్‌..

Dil Raju : కొన్నాళ్లుగా థియేట‌ర్స్ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ రావట్లేదని గ‌గ్గోలు పెడుతున్నారు. అందులో ముఖ్య కారణాలు పెరిగిన టికెట్ రేట్లు ఒకటి అయితే ఇంకోటి సినిమాలు థియేటర్లో రిలీజయిన తర్వాత త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం. ఇటీవల చిన్న సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీలో సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే ఇదే విషయమై తాజాగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రేక్షకులు థియేర్లకు రాకుండా వాళ్లను తామే చెడగొట్టామని చెప్పుకొచ్చారు. థియేటర్లలో వచ్చిన నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఓటీటీలోకి త్వరగానే వచ్చేస్తుంది సినిమా అంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకు అని చాలా మంది అనుకుంటున్నారు. దీనిపై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నా ఫలితం లేదు. చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి. ఇటీవల చాలా మంది థియేటర్ కి వచ్చి సినిమాలు చూడట్లేదు. నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నాము అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.

Dil Raju comments on current situation of theatres
Dil Raju

కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు మెల్లగా జనానికి ఎక్కుతాయి. మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు థియేటర్స్ లో కొనసాగితే ఎన్ని రోజులు అయిన ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు అన్నారు.ఇప్పటికే బాలీవుడ్ లో హిందీ సినిమాల రిలీజ్ విషయంలో నిబంధనలు కాస్త‌ కఠినతరం చేశారు. ఏ సినిమా అయిన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలని అక్కడ మల్టీప్లెక్స్ ఓనర్స్ కండిషన్స్ పెట్టడంతో కాస్త థియేట‌ర్ యాజ‌మాన్యానికి ఉప‌శ‌మనం ల‌భించింది. మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలలో కూడా సినిమాలు ఓటీటీ రిలీజ్ విషయంలో కొత్తగా నిబంధనలు తీసుకొచ్చారు. మ‌రి తెలుగులో కూడా అలాంటి పరిస్థితులు రావాల‌ని కొంద‌రు నిర్మాత‌లు కోరుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago