Dil Raju : స్రంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి పెరుగడం ఖాయం. సంక్రాంతి వేడుకలతో అన్ని గ్రామాలు, లోగిళ్లు కళకళలాడతాయి. సినిమా థియేటర్లు కూడా సందడిగా మారతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందుగా గుంటూరు కారం చూస్తే.. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక నాగార్జున, అషికా రంగనాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన నా సామిరంగ చిత్రం కూడా ప్రేక్షకులని అలరించబోతుంది.
.ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా శ్రినివాస చిట్టూరి దీనిని నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య ప్రధాన పాత్రలను పోషించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించగా… వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ఆంజనేయస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘హను-మాన్’.
ఒక సామాన్యుడు అసామాన్యమైన శక్తులను పొంది… చెడుపై ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా ప్రధాన కథ. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అయితే సంక్రాంతికి రానున్న ఈ సినిమాల మధ్య పోటీ నెలకొని ఉండగా, నిర్మాత దిల్ రాజు గుంటూరు కారం విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. ఇక రీసెంట్‌గా హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైన చిరు మూవీకి తన ఫుల్ సపోర్ట్ అందించాడు. ఈ సంక్రాంతికి గొడవలు లేకుండా మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేయమన్నట్టు మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…