Dhamaka Review : మాస్ మహరాజా రవితేజ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. క్రాక్ మూవీతో బంపర్ హిట్ కొట్టిన రవితేజ ఆనందాన్ని ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ఆవిరి చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రాలు ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోవడంతో ఇవి ఫ్యాన్స్ ని సైతం ఇబ్బంది పెట్టాయి. ఈ టైం లో రవితేజకు సాలిడ్ హిట్ పడితేనే కిక్ అని జనాలు నమ్ముతున్నారు. రవితేజ ఫ్యాన్స్ హిట్ దాహం ధమాకా తీరుస్తుందని ఆశిస్తుండగా, ఈ సినిమా సక్సెస్ టాక్‌తో సాగుతుంది. సినిమా కథ రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది. స్వామి (రవితేజ), ఒక మురికివాడలో నివసించే పేద, ఉద్యోగం లేని వ్యక్తి. మరో పాత్ర ఆనంద్ చక్రవర్తి ( రవితేజ) 1,000 మందికి ఉపాధి కల్పించగల మల్టీ మిలియనీర్.
హీరోయిన్ శ్రీలీల ఈ ఇద్దరినీ ప్రేమించగా, ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని సినిమా చూస్తే తెలుస్తుంది. . త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. ఈ సినిమాకి సంగీతం భీమ్స్ అందించారు. అవన్నీ కూడా సినిమాకి కలిసొచ్చాయి. ముఖ్యంగా రవితేజ ఈ సినిమాని తన భుజ స్కందాలపై వేసుకొని నడిపించాడు. మాంచి మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కగా, ఇది అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది.ఇక చిత్రంలో శ్రీలీల రవితేజకు పోటీగా ఆమె పెర్ఫామ్ చేసింది. ఇక జయరామ్, సచిన్, తనికెళ్ళ భరణి వారి పాత్రల పరిదిమేర న్యాయంచేశారు.
ధమాకా సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ అంతా రొటీన్‌గా ఉంటుంది, మాస్ కు మంచి ఎంటర్టైన్మెట్ ను అందిస్తుంది. ఏం జరగబోతుంది అనేది కాస్త గెస్ చేసేలా ఉండడం మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ మార్క్ హడావిడి కామెడీతో గందరగోళంగా ఉన్నా కూడా మాస్ కు బాగా నచ్చేలా ఉంటుంది. ఇక అసలు కథ.. సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మూవీని కాస్త సీరియస్ గా నడిపించే ప్రయత్నంచేశాడు డైరెక్టర్ త్రినాథ్ రావ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…