Devi Nagavalli : టీవీ9 యాంకర్ దేవీ నాగ వల్లి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోతోపాటు ఇటీవల విశ్వక్ సేన్‌పై నోరు పారేసుకోవడంతో ఈ అమ్మడి పేరు తెగ మారు మ్రోగింది. బిగ్ బాస్ సీజన్ 4 లో ఆమె ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఊహించని విధంగా దేవి ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే దేవి నాగవల్లి కొంత కాలంగా న్యూస్ రీడర్‌గా పని చేస్తుండగా, ఆమె సంపాదన విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
చాలా కాలం నుండి టీవీ 9లో కొనసాగుతున్న దేవి నాగవల్లికి వేరే ఛానల్స్ నుండి భారీ ఆఫర్సే వస్తున్నాయట. అయితే ఆమెను టీవీ 9 వదులుకోదలచుకోవడం లేదు. అందుకే శాలరీ కూడా కొంత ఎక్కువ మొత్తమే ఇస్తున్నారట. దేవీ నాగవల్లికి టీవీ9 నెలకు రెండు లక్షల రూపాయల శాలరీ ఇస్తారట. ఇతర కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా వంటి యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం. అంటే సంపాదన నెలకు రెండున్నర లక్షలు అని టాక్. సెలబ్రిటీ స్టేటస్ పొందిన దేవి ఆ మధ్య ఓ లగ్జరీ కారు కూడా కొనుగోలు చేసింది.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న దేవి నాగవల్లి చాలా మందికి ఆదర్శం. అయితే కొన్ని సందర్భాలలో నోటి దూల వలన చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్‌ని గెటౌట్ అన్నది. ఆమె ఎప్పుడైతే గెటౌట్ అని అన్నదో.. విశ్వక్ సేన్ ఎఫ్.. తో వచ్చే పదాన్ని వాడేశాడు. ఈ విషయం కొద్ది రోజుల క్రితం నానా రచ్చగా మారింది. ప్రస్తుతం అయితే దేవి నాగవల్లి ఎలాంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…