Amala Akkineni : ఒకప్పటి అందాల హీరోయిన్, అక్కినేని కోడలు అమల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అప్పట్లో టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన అమల పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసింది. జంతు ప్రేమకురాలిగా మారి వాటి బాగోగులు చూసుకుంటుంది. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను చూసుకుంటూ భర్తకు బిజినెస్ లో సహాయం చేస్తూ టైం గడుపుతుంది. ఇక వీలున్నప్పుడల్లా మంచి కథాంశం ఉన్న సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తుంది. అమల రీసెంట్‌గా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితంలో నటించి మెప్పించింది.
తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంలో మాదిరిగా టైం మిషన్ లోకి కి వెళ్లే అవకాశం వస్తే నేను పదేళ్ల భవిష్యత్తులోకి వెళ్ళిపోతాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది . ఇక ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పిన అమల ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హగ్ చేసుకుని ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. నాగార్జునతో మళ్లీ వెండి తెర పంచుకొనే అవకాశం ఉందా..? అని అడిగితే.. నో అంటున్నారామె. ఇంట్లో ఎలాగూ కలిసే ఉంటాం కదా. తెరపై కూడా ఎందుకు.. అని తెలివిగా సమాధానం ఇచ్చింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరవాత తెలుగులో కంటే మిగిలిన భాషల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో మళ్లీ కనిపిస్తే ఓ మంచి పాత్ర చేయాలి అనుకున్నా. అందుకే ఇన్నాళ్లు ఎదురు చూశా. ఒకే ఒక జీవితం సినిమా అందరికీ నచ్చింది. నా పాత్ర మరింత చేరువ అయ్యింది. ఇక మీదట మంచి పాత్రలు వస్తే తప్పక చేస్తా అని చెప్పుకొచ్చింది అమల. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా నాగార్జున, అమలని తిరిగి ఒక్కసారైనా వెండితెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…