కోవిడ్‌తో ప్రజలంతా భయభ్రాంతులవుతున్న సమయంలో రానా తాను ప్రేమించిన మిహికాని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రానా, మిహిక దాంపత్యం సాఫీగా సాగుతుంది. మధ్య మధ్యలో వారిద్దరు విడిపోతున్నట్టు పుకార్లు వచ్చేవి. ఆ సమయంలో అన్యోన్యంగా ఉంటూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ గాసిప్ వార్తలపై నీళ్లు చల్లారు.కొద్ది రోజులుగా మిహికా బజాజ్ ప్రెగ్నెంట్ అని రానా మరియు మిహికా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు మరింత ఎక్కువైన నేపథ్యంలో మిహికా బజాజ్ క్లారిటీ ఇచ్చింది. తాను ప్రెగ్నెంట్ కాదని కానీ తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది మిహికా. దీంతో తమకు సంబంధించిన అన్ని వార్తలకు ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టింది మిహికా. బాహుబలి తర్వాత రానా నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేకోపోయాయి. అయితే ఆయన భారీగా ఆశలు పెట్టుకొన్న సినిమాలు నిరాశను కలిగించాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం రానానాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా నటించడం విశేషంగా మారింది. ఈ ఇద్దరు కలిసి నటించడం ఇదే మొదటిసారి.
రానా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ మధ్యనే రానా హీరోగా నటించిన “విరాటపర్వం” సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. రానాకి ఇప్పుడు మంచి హిట్ కావల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ క్రమంలో మనోడు తర్వాతి ప్రాజెక్టులని ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…