Chiranjeevi : చిరంజీవిపై చేయి వేసిన కుర్ర హీరో.. మెగాస్టార్ ఎలా స్పందించాడంటే..!

Chiranjeevi : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి. ఆయ‌న‌తో క‌ల‌వాల‌ని ఎంద‌రో అభిమానులు కోరుకుంటున్నారు.క‌నీసం హీరోతో ఒకసారి ఫొటో దిగినా చాలని జీవితకాలం ఎదురుచూసేవారు కూడా ఉంటారు. మెగాస్టార్ అంటే ఎల్లల్లేని అభిమానాన్ని చూపిస్తుంటారు. చిరంజీవి కూడా తనను కలిసినవారిని బాగా ప్రోత్సహిస్తారు. తాజాగా అటువంటి సందర్భం ఒకటి ఎదురుకాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజయ్యింది.. భారీ విజయం కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ కూడా చూసి బాగుందని మెచ్చుకున్నారు..

అంతే కాదు కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి ఇంటికి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు. అందరు కొత్త వాళ్లు కావడం.. మరికొంత మంది పాత వారు అయినా.. చాలా మంది నటులకు ఈ సినిమాతోనే గుర్తింపు రావడం.. చిరంజీవి అభినందించడంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఇక ఈ టీమ్ లో చాలామందికి చిరంజీవి ఫేవరేట్ హీరో అవ్వడంతో… మెగాస్టార్ నుకలిసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఈ మూవీ హీరోలలో ఒకరైన యశ్వంత్ చిరంజీవి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ని ఇచ్చి చిరంజీవి కాళ్ళకు నమస్కారం చూసి ఆశీర్వాదం తీసుకున్నాడు.

commitee kurrallu movie team met Chiranjeevi
Chiranjeevi

అనంతరం చిరంజీవితో ఫోటో దిగడానికి యశ్వంత్ రాగా చిరు యశ్వంత్ పై చెయ్యి వేయగా యశ్వంత్ కూడా చిరంజీవి వెనుక నుంచి చెయ్యి వేసాడు. వెంటనే పక్కనే ఉన్న చిరంజీవి అసిస్టెంట్ యశ్వంత్ చెయ్యి తీసేసాడు. వెంటనే కంగారు పడ్డ యశ్వంత్.. చేయి తీసేసి కాస్త దూరంగా నిలుచున్నాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే చిరంజీవి తన అసిస్టెంట్ తో.. వారు కుర్రాళ్లు.. అలాగే ఉంటారు.. ఇబ్బంది పెట్టకూడదంటారు. నువ్వు చెయ్యి వేసుకో పర్వాలేదు అంటూ యశ్వంత్ చేయి తనవైపు లాక్కొని వీపుమీద వేసుకుంటారు. చిరంజీవి చేసిన ఈ పని చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. చిరంజీవిలో ఉన్న గొప్పతనానికి, నిరాడంబరతకు ఇది నిదర్శనమన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago