Chiranjeevi : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి. ఆయనతో కలవాలని ఎందరో అభిమానులు కోరుకుంటున్నారు.కనీసం హీరోతో ఒకసారి ఫొటో దిగినా చాలని జీవితకాలం ఎదురుచూసేవారు కూడా ఉంటారు. మెగాస్టార్ అంటే ఎల్లల్లేని అభిమానాన్ని చూపిస్తుంటారు. చిరంజీవి కూడా తనను కలిసినవారిని బాగా ప్రోత్సహిస్తారు. తాజాగా అటువంటి సందర్భం ఒకటి ఎదురుకాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రీసెంట్ గా నాగబాబు కూతురు నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజయ్యింది.. భారీ విజయం కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్ కూడా చూసి బాగుందని మెచ్చుకున్నారు..
అంతే కాదు కమిటీ కుర్రాళ్ళు మూవీ టీం అందర్నీ చిరంజీవి ఇంటికి పిలిచి అభినందించారు. దీంతో అక్కడికి వచ్చిన మూవీ టీమ్ అంతా మెగాస్టార్ తో ఫోటోలు దిగారు. అందరు కొత్త వాళ్లు కావడం.. మరికొంత మంది పాత వారు అయినా.. చాలా మంది నటులకు ఈ సినిమాతోనే గుర్తింపు రావడం.. చిరంజీవి అభినందించడంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. ఇక ఈ టీమ్ లో చాలామందికి చిరంజీవి ఫేవరేట్ హీరో అవ్వడంతో… మెగాస్టార్ నుకలిసిన ఆనందంలో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఈ మూవీ హీరోలలో ఒకరైన యశ్వంత్ చిరంజీవి కోసం తెచ్చిన గిఫ్ట్స్ ని ఇచ్చి చిరంజీవి కాళ్ళకు నమస్కారం చూసి ఆశీర్వాదం తీసుకున్నాడు.
అనంతరం చిరంజీవితో ఫోటో దిగడానికి యశ్వంత్ రాగా చిరు యశ్వంత్ పై చెయ్యి వేయగా యశ్వంత్ కూడా చిరంజీవి వెనుక నుంచి చెయ్యి వేసాడు. వెంటనే పక్కనే ఉన్న చిరంజీవి అసిస్టెంట్ యశ్వంత్ చెయ్యి తీసేసాడు. వెంటనే కంగారు పడ్డ యశ్వంత్.. చేయి తీసేసి కాస్త దూరంగా నిలుచున్నాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే చిరంజీవి తన అసిస్టెంట్ తో.. వారు కుర్రాళ్లు.. అలాగే ఉంటారు.. ఇబ్బంది పెట్టకూడదంటారు. నువ్వు చెయ్యి వేసుకో పర్వాలేదు అంటూ యశ్వంత్ చేయి తనవైపు లాక్కొని వీపుమీద వేసుకుంటారు. చిరంజీవి చేసిన ఈ పని చూసి అభిమానులంతా మురిసిపోతున్నారు. చిరంజీవిలో ఉన్న గొప్పతనానికి, నిరాడంబరతకు ఇది నిదర్శనమన్నారు.