Comedian Raghu : జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సినిమాల్లో ఎంత క్రేజ్ ఉందో రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ ఉంది అని చెప్పాలి . సినిమాల్లో ఎన్టీఆర్ స్టామినా ఏంటో ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ స్టామినా ఏంటి అనేది ప్రూవ్ కావల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సత్తా చాటడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తుంటారు. ఆయన రాజకీయాలకి రావాలని అభిమానులు తోటి సన్నిహితులు కోరుతున్నారు. అయితే ఇది తగిన సమయం కాదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.
తాజాగా కమెడీయన్ రఘు ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇవ్వడమే కాదు.. ఎవడి ప్రాణం తీయమన్నా తీసేస్తా. పలానా వాడు ఇలా అన్నాడని చెప్తే.. రేపటికల్లా వాడి ప్రాణం ఉండదు. ఎన్టీఆర్ జోలికి ఎవరు వచ్చినా ప్రాణం తీసేయడమే ఆయన కోసం చావడానికైనా.. చంపడానికైనా సిద్ధమే అని అంటున్నాడు కమెడీయన్ రఘు. ఎన్టీఆర్‌కి ఎవరితోనూ గ్యాప్ రాలేదు. ఎవరి బిజీ లైఫ్‌లో వాళ్లం ఉన్నాం. తిరగాల్సిన టైంలో రాత్రి 2 వరకూ తిరిగేవాళ్లం. మా పర్సనల్ లైఫ్‌ని ప్రతిదీ షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నాడు రఘు.
ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయనతోనే ఉంటూ పీఆర్ వర్క్ చేసేవాడ్ని. రాజీవ్, రాఘవ, పెద్ది ఇలా టీం ఉండేది. రాజీవ్ గారు ఎక్కువ ఉన్నారు. ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్‌కి జరిగిన టైంలో ఆ కారు నేను ఎక్కాల్సింది.. చివరి నిమిషంలో తప్పుకున్నా. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు శక్తి. గొప్ప టాలెంట్ ఉన్ననటుడు. ఆ భగవంతుడే ఎన్టీఆర్‌ని పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడారు. ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడు.. భవిష్యత్‌లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు. ఎప్పుడు అవుతారనేది చెప్పలేం అది ఆయన ఇష్టం.. కానీ వస్తే మాత్రం ఎన్టీఆర్ సీఎం కావడం పక్కా అంటూ రఘు జోస్యం చెప్పారు. కాగా, రఘు.. ఆది సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి దాదాపు 200కిపైగా సినిమాలలో నటించాడు.