Babai Hotel : తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా చేసిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగేవారు. నందమూరి నటసింహం ఎన్టీఆర్ పేరు చెప్తేనే అదొక ఎమోషన్. అందుకే అందరూ కూడా ఎన్టీఆర్ కి ఆత్మీయులు. సినిమా ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు రాకముందు బాబాయ్ హోటల్ అనే ఒక హోటల్ కి ప్రతిరోజు వెళ్లి పాలు పోసేవారట. అలా ఈ హోటల్ కి అన్నగారికి ఒక ప్రత్యేకమైన బంధం ఉంది . ఎన్టీఆర్ సినిమాలలోకి రాకముందు ఆయన పాలు, పెరుగు అమ్ముతూ జీవించేవారు.
అలా రెగ్యులర్ గా బాబాయ్ హోటల్ కి ఎన్టీఆర్ పాలు పోసేవారు.దాంతో ఎన్టీఆర్ కి బాబాయ్ హోటల్ కి మంచి సంబంధం బాంధవ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సినిమాలు మానేసినా కూడా ఆ హోటల్ తో అనుబంధం కంటిన్యూ చేయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఎన్టీఆర్ పుట్టింది పెరిగింది అంతా నిమ్మకూరులోనే అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మద్రాస్ కు మకాం మార్చారు. సినిమాలలో బిజీగా ఉండి స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ వద్దకు బాబాయ్ హోటల్ నుండి ఒక బృందం వచ్చి కలిసి వెళుతూ ఉండేది.
ఇలా వాళ్లకు ఎన్టీఆర్ ని చూడాలనిపించినప్పుడల్లా బృందమంతా కలిసి మద్రాస్ వెళ్లేదట. ఎన్టీఆర్ కూడా వాళ్లను తన అతిథులుగా భావించి షూటింగ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని తన ఇంట్లో వారికి అతిధి మర్యాదలు చేసేవారు. అలా ఎన్టీఆర్ ఇంటికి బాబాయ్ హోటల్ కు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఏటా ఒకరోజు టైం పెట్టుకొని అన్నగారిని కలవాలనుకున్న వారందరూ కూడా బాబాయి హోటల్ ని అడ్డాగా పెట్టుకొని అక్కడ కలుసుకొని అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుంచి మద్రాస్ కు చేరుకొని అన్నగారింటికి వెళ్లేవారట .వీరంతా కూడా అన్నగారికి పెద్ద అభిమానులను చెప్పాలి.