CM YS Jagan : ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ ముఖ్యనేతలకు మాత్రం ఫలితంపైన స్పష్టత వచ్చేసింది. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని కొందరు ధీమాగా ఉన్నారు. మరోవైపు 22 కన్నా ఎంపీ సీట్లు కూడా ఆయన దక్కించుకుంటారనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ కేంద్రంగా వైసీపీ మద్దతు కోసం కీలక రాయబారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సారి బీజేపీ, టీడీపీ, జనసేనతో జతకట్టడంతో కేంద్రంలోని ఇండియా కూటమి నేతలు జగన్ వైపు మొగ్గుతున్నట్లు చెబుతున్నారు. వైసీపీ ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే.. కచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ కీలకం అవుతారు.
అందుకే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి వైసీపీకి రాయబారాలు మొదలయ్యాయని ఓ టాక్ నడుస్తుంది. వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా.. ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ ఏపీలో టీడీపీతో కలవడంతో తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు జగన్‌పై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ముందు ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనది ఆసక్తికరంగా మారింది. 2019లో వైసీపీ గెలిచిన తరువాత ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచింది. పలు బిల్లుల విషయంలో మద్దతు ప్రకటించింది.
కేంద్రం నుంచి జగన్ కు అనేక అంశాల్లో సహకారం అందింది. అయితే, అనూహ్యంగా ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఏపీలోని బీజేపీ ముఖ్యులు సైతం పార్టీ నాయకత్వానికి ఏపీలో పోలింగ్ సరళి పైన నివేదికలు ఇచ్చారు.కేంద్రంలో ఈ సారి ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, లోక్ సభ సీట్ల కంటే బీజేపీకి రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు అవసరం. ఇప్పటి వరకు వైసీపీ రాజ్యసభలో సహకారం అందింది. ఇప్పుడు టీడీపీతో బీజేపీ కలవటంతో ఇక జగన్ నుంచి ఆ సహకారం అందుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…