Actress Anjali : విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అంజలి హీరోయిన్లుగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా మే 31న విడుదలైంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే బాలకృష్ణ ఈ ఈవెంట్ లో సరదాగా చేసిన పని కాస్త చాలా కాంట్రవర్సీలకు దారితీసింది. అంజలితో బాలకృష్ణ ప్రవర్తనపై హిందీ సెలబ్రిటీస్ కూడా కొంతమంది మంది పడ్డారు. ఈ క్రమంలో విశ్వక్ అలానే నిర్మాత నాగవంశీ మాత్రం బాలకృష్ణను వెనకేసుకుని వచ్చారు. ఈ ఘటనపై అంజలి కూడా పాజటివ్‌గానే స్పందించింది.
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు..బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి..నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది.” అంటూ బాలయ్యతో పాటు ఉన్న వీడియోను అంజలి పోస్ట్ చేశారు. అంజలి కామెంట్‌తో పుకార్లకి కాస్త బ్రేక్ పడ్డట్టు అయింది. గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలకృష్ణ, అంజలి కలిసి నటించారు. అంజలికి టాలెంట్, ప్యాషన్ చాలా ఉన్నాయని తన స్పీచ్‍లో ప్రశంసించారు బాలయ్య. అలాగే, ఇండస్ట్రీలో తాను కొందరితోనే చనువుగా ఉంటానని, అందులో విశ్వక్ ఒకరని బాలకృష్ణ చెప్పారు.
ఏ ముహూర్తాన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తానని మాటిచ్చాడో తెలియదు కానీ.. ఆ ఈవెంట్‌కు సంబంధించి సినిమా కంటే కూడా బాలయ్య పేరు బాగా వైరల్ అవుతోంది. ఈ వేడుకలో బాలయ్యపై కొందరు చేసిన గ్రాఫిక్స్ వీడియోలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అవి గ్రాఫిక్స్ చేశారని చిత్ర నిర్మాత, హీరో వివరణ ఇచ్చారంటే.. ఏ రేంజ్‌లో ఆ వీడియోలు హాట్ టాపిక్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య ప్రస్తుతం నటుడిగా,రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నార. ఆయన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…