YSRCP : ఆరా మ‌స్తాన్ స‌ర్వే.. వైసీపీ నుంచి వీళ్లు ఓడిపోతున్నారా..?

YSRCP : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేనివిధంగా హోరాహోరీగా సాగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్ ఎక్కువ శాతం జరిగింది. ఓటర్లు సైతం అర్ధరాత్రి వరకు క్యూలైన్‌లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరిని పలకరించినా కసిగా ఓటేసినట్లుగా చెప్పారు. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందోనని అభ్యర్ధులు, పార్టీలు టెన్షన్‌తో ఉన్నాయి. ఫలితాలు రాకపోయినప్పటికి దానికి దగ్గరగా ఉండే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అందుకు తగినట్లుగానే శనివారం సాయంత్రం లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు, జాతీయ మీడియా నిర్వహించిన ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ రూపంలో విడుదల చేశాయి.

ఇక అందరు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆరా మస్తాన్‌ సర్వే…వైసీపీకి పట్టం కట్టింది. ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్‌కు మహిళలు జై కొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6 శాతం ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది.

YSRCP aara mastan survey who is losing in it
YSRCP

ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందులో ఆరింట్లో ఎన్డీయే కూటమే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అన్ని సర్వేలు ఎన్డీయే కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. కానీ ఆరా సంస్థ అందుకు భిన్నమైన అంచనాలను వెలువరించడం తెలుగునాట ఆసక్తికర చర్చకు దారితీసింది. అయితే ఆరా మస్తాన్ కూటమికి వ్యతిరేకంగా తన సర్వే ఫలితాలను ప్రకటిస్తారని ఏపీ ఎన్నికల పోలింగ్ జరగడానికి ముందే చెప్పారు హీరో శివాజీ. అయితే ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండటం చర్చనీయాంశమైంది. నిజంగానే కూటమి నుంచి టికెట్ దక్కలేదన్న కక్షతోనే మస్తాన్ ఇలాంటి సర్వే వదిలారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి ఈ వ్యవహారంపై శివాజీ మరోసారి స్పందిస్తారేమో చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago