CM YS Jagan : ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. సీఎం వైఎస్ జగన్ తో పాటు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా హైకోర్టు మాత్రం నోటీసులు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని పథకాలు కూడా ఏపీలో ఉన్నాయి. అయితే వీటి వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాని, వాటిపై సీబీఐ విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని విచారించే విషయంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపారు. అసలు ఈ పిల్ కు విచారణార్హత లేదని వాదించారు. అయితే హైకోర్టు మాత్రం రఘురామ పిల్ లో పేర్కొన్న 41 మంది ప్రతివాదులకు నోటీసులు పంపింది.
మరోవైపు రఘురామ దాఖలు చేసిన పిల్ విచారించే అంశంపై ఆయన తరఫు న్యాయవాది కూడా తమదైన శైలిలో వాదనలు వినిపించారు. రఘురామ పిల్ దాఖలు చేశారని తెలియగానే ప్రభుత్వం వీటికి సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఈ పిల్ పై విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…