Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM YS Jagan : సీఎం జ‌గ‌న్‌కి పెద్ద షాకిచ్చిన హైకోర్ట్.. ఏం జ‌రిగింది..?

Shreyan Ch by Shreyan Ch
November 25, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM YS Jagan : ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ పిల్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. సీఎం వైఎస్ జగన్ తో పాటు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్ కు విచారణార్హత లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా హైకోర్టు మాత్రం నోటీసులు జారీ చేసింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని పథకాలు కూడా ఏపీలో ఉన్నాయి. అయితే వీటి వెనుక ఆర్ధిక అక్రమాలు జరుగుతున్నాని, వాటిపై సీబీఐ విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ చేసిన విష‌యం తెలిసిందే. దీన్ని విచారించే విషయంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం అభ్యంతరం తెలిపారు. అసలు ఈ పిల్ కు విచారణార్హత లేదని వాదించారు. అయితే హైకోర్టు మాత్రం రఘురామ పిల్ లో పేర్కొన్న 41 మంది ప్రతివాదులకు నోటీసులు పంపింది.

CM YS Jagan got notices from high court
CM YS Jagan

మరోవైపు రఘురామ దాఖలు చేసిన పిల్ విచారించే అంశంపై ఆయన తరఫు న్యాయవాది కూడా త‌మ‌దైన శైలిలో వాదనలు వినిపించారు. రఘురామ పిల్ దాఖలు చేశారని తెలియగానే ప్రభుత్వం వీటికి సంబంధించిన రికార్డులు ధ్వంసం చేసిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం ఈ పిల్ పై విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది.

Tags: cm ys jagan
Previous Post

Samantha : షాకిచ్చేలా స‌మంత వ‌ర్క‌వుట్స్..నెటిజ‌న్స్ మైండ్ బ్లాక్ అవుతుందంతే..!

Next Post

Barrelakka : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న.. నీ గురించి నాకు తెలుసు.. న‌న్ను క్ష‌మించ‌మంటూ బ‌ర్రెల‌క్క కామెంట్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.