CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అందుకున్న తర్వాత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నామంటే.. డబ్బుల్ని నీళ్ల మాదిరి ఖర్చు చేసే సీఎంలకు భిన్నంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రభుత్వం సమకూర్చే కారులో కాకుండా.. తనసొంత వాహనంలోనే ముఖ్యమంత్రిగా కూడా ప్రయాణిస్తున్నారు. ఈ కారణంతోనే ముఖ్యమంత్రి వాహన శ్రేణిలో మిగిలిన కార్లకు భిన్నంగా బ్లాక్ కారు ఉంటోంది. విలాసాలకు దూరంగా.. వీలైనంత సింఫుల్ గా ఉండాలన్నదే తన లక్ష్యమంటున్న రేవంత్.. ఇప్పటికే ప్రజాభవన్ లో ఉండేందుకు నో చెప్పటం తెలిసిందే.
ఇక కొత్త కాన్వాయ్ ను కొనుగోలు చేస్తామని అధికారులు అడిగారని.. కానీ తాను వద్దని చెప్పినట్లు చెబుతున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారునే ఉపయోగించాలని భద్రతా అధికారులు చెప్పటంతో.. తన సొంతకారునే బుల్లెట్ ప్రూఫ్ చేయాల్సిందిగా చెప్పినట్లు చెప్పారు. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ కాన్వాయ్ కొనాలంటే మళ్లీ రూ.50 కోట్లు అవసరమవుతాయి.. తను ఒక్క పైసా కూడా వేస్టు చేయమని చెప్పటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు గతం నుంచి ఉన్న కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. గతంలో మాదిరి కాకుండా.. ప్రతి పైసా ఆచితూచి ఖర్చు చేసేలా రేవంత్ అడుగులు ఉన్నాయని చెప్పాలి.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. ఢిల్లీ వెళ్లే ప్రతి సారీ ప్రైవేటు ఫ్లైట్ తీసుకుంటారా? లేదంటే.. కొందరు ముఖ్యమంత్రుల మాదిరి విమానంలో ప్రయాణిస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ ప్రత్యేక విమాన సౌకర్యాన్నివదిలేసి.. మామూలుగా విమాన ప్రయాణం చేస్తే మాత్రం.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త రోజులు వచ్చినట్లే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకోసం ట్రాఫిక్‌ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని అనుమతించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కారుకు టీఎస్ 07ఎఫ్ఎఫ్0009 నంబర్ కేటాయించారు. మిగతా కార్లకు టీఎస్09ఆర్ఆర్0009 సిరీస్ నంబర్ ఉంటుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…