Mallareddy : తీన్మార్ మల్ల‌న్న‌తో మ‌ల్లారెడ్డి ముచ్చ‌ట‌.. అవ‌స‌రమైతే కాంగ్రెస్‌లోకి వ‌స్తాన్న మ‌ల్లారెడ్డి..

Mallareddy : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంద‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య‌లు చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. మ‌ల్లారెడ్డి ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది. ‘పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు వేసినా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

హజంగానే మల్లారెడ్డి అంటే చింతపండు నవీన్( తీన్మార్ మ‌ల్ల‌న్న‌) ఎగిరి పడుతుంటారు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ఉంటారు. మల్లారెడ్డి భూకబ్జాలు చేశాడని, అతడు చేసిన భూతం దందాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని పలుమార్లు తీన్మార్ మల్లన్న ప్రకటించాడు కూడా. అంతేకాదు మల్లారెడ్డి బాధితులతో మాట్లాడాడు కూడా. అయితే ఇదే సందర్భంలో మల్లారెడ్డి ఆదేశాలతోనే మేడిపల్లి పోలీసులు పలుమార్లు నన్ను అరెస్టు చేయించి జైల్లో పెట్టారని మల్లన్న చాలాసార్లు చెప్పుకు రావ‌డ మనం చూశాం. ఒకానొక దశలో మొదటి ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మల్లన్న చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాడు.

Mallareddy talk with teenmar mallanna
Mallareddy

బద్ధ శత్రువుల్లా కనిపించే వీరిద్దరూ అసెంబ్లీ లాబీలో కలుసుకున్నారు. వీరికి కొంతమంది విలేకరులు కూడా జతయ్యారు. సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. వాటికి మల్లారెడ్డి కూడా తన స్టైల్లో సమాధానం చెప్పారు. తీన్మార్ మల్లన్న మేడ్చల్‌లో పోటీ చేస్తే టఫ్‌గా ఉండేదా? అని అడగ్గా అలా ఏమీ కాదని మల్లన్న అన్నారు. లేదూ.. మల్లన్న ఓడిపోయేవాడన్నట్టుగా తీన్మార్ మల్లన్న కామెంట్ చేశాడు. నువ్వు ఏదైనా అనుకో.. ఎలాగైనా అనుకో అంటూ మల్లారెడ్డి లైట్ తీసుకున్నాడు. మేడ్చల్‌లో తీన్మార మల్లన్న పోటీ చేస్తే ఒక మల్లన్న అయితే.. అసెంబ్లీకి వచ్చేవాడని అన్నాడు. ఎవరు వచ్చినా ఒక్కటేనా? అని అడగ్గా.. ఒక్కటే కదా అని మల్లారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న కూడా ఇందుకు అంతే అన్నట్టుగా సమాధానం ఇచ్చాడు. తామిద్దరిదీ పాల‘కులం’ అని వివరించాడు. ఇద్దరికీ పాలతో సంబంధం ఉన్నదని చెప్పాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు శాసన సభలో ఏమైనా తక్కువ పడితే సపోర్ట్ చేస్తావా ? అని తీన్మార్ మల్లన్న అడ‌గ‌గా, తప్పకుండా ఉంటానని చెప్పాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago