KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానుండగా, అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించనుండగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చనున్నారు. అయితే శుక్రవారం గవర్నర్ ప్రసంగంలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. గట్టిగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయిన నేపథ్యంలో చర్చ హాట్ హాట్‌గా జరుగే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఏంటా అనే ఇంట్రెస్ట్ సర్వత్రా నెలకొంది. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమేనని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. మరోవైపు కేటీఆర్ అసెంబ్లీ గరంగరం అయ్యారు.
రాజీవ్ గాంధీ గురంచి అస్సాం ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడితే మా నాయకుడు ఖండించారు. మాకు వాళ్ల పార్టీకి సంబంధం లేదు. కాని మేము ఖండించాం. అయితే మా ముఖ్యమంత్రి బర్త్ డే వేడుకలని మేము సంతోషంగా చేసుకుంటే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతాప దినాలు చేసుకోవాలని అంటాడా అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. అలానే రేవంత్‌పై పలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క కల్పించుకొని వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వాటిని రికార్డ్‌లలో నుండి తొలగించాలని అన్నారు. మొత్తానికి కేటీఆర్ స్పీచ్‌తో అసెంబ్లీ దద్దరిల్లింది అనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…