CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఇక అసెంబ్లీలోను వణుకు పుట్టిస్తున్నారు . సీఎం రేవంత రెడ్డికి, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే చర్చలో భాగంగా.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే.. ప్రతిపక్ష నేత కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్‌ది మేనేజ్ మెంట్ కోటా అని, ఆయన ఎన్‌ఆర్ఐ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. సీఎం రేవంత్ కామెంట్లకు కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తనది మేనేజ్‌మెంట్ కోటా అయితే సీఎం రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
గవర్నర్ ప్రసంగం వింటుంటే సిగ్గనిపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారని… కానీ తాను ఇప్పుడు చెప్పబోయే వాటికి ఆయన నిజంగానే సిగ్గుపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతు రాజ్యమని చెప్పిన గత ప్రభుత్వం… ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపిన రైతులను అరెస్ట్ చేసి వారికి బేడీలు వేసి అమానుషంగా కోర్టుకు తీసుకు వెళ్లినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు. పన్నెండో తరగతి ప్రశ్నాపత్రాలు సరిగ్గా దిద్దలేక… ప్రయివేటు వ్యక్తులకు కాంట్రాక్టు పద్ధతిన ఇవ్వడంతో పాతికమంది పిల్లలు చనిపోయినందుకు సిగ్గుపడాల్సిందే అన్నారు. పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేనందుకు, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు జిరాక్స్ తీసి అమ్ముకున్నందుకు, 30 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయేలా చేసినందుకు… ఇలా అన్నింటికీ సిగ్గుపడాల్సిందే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఇసుకపై రాష్ట్రానికి కేవలం రూ. 40కోట్ల ఆదాయం వచ్చిందని.. అదే 2014 నుంచి 2023 వరకు రూ. 5 వేల కోట్ల ఆదాయం సమకూరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇసుక మాఫియా బీఆర్‌ఎస్‌ది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని స్పష్టం చేశారు. ఇసుక మాఫియా వల్ల నేరళ్లలో దళితులను లారీలతో తొక్కించారని, పోలీసులతో కరెంట్ షాకులు ఇప్పించారంటూ.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉందని కేటీఆర్ ప్రస్తావించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…