CM Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్ జరగగా,ఈ సెషన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో మనం చూశాం. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ బకాయిల అంశంలో విపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. బకాయిల విషయంలో మొదటి స్థానంలో సిద్ధిపేట (61.37%), రెండో స్థానంలో గజ్వేల్ (50.29%), మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ (43 శాతం) ఉన్నాయని తెలిపారు. సిద్ధిపేటలో హరీశ్ రావు, గజ్వేల్ లో కేసీఆర్, హైదరాబాద్ సౌత్ లో అక్బరుద్దీన్.. బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9మంది మరణించారు. ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించ లేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పని లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత చర్చలో ప్రభుత్వాన్ని హరీష్ రావు ఎదుర్కొన్న తీరు బీఆర్ఎస్ వర్గాలను సంతృప్తి పరిచింది. ఆయన సూటిగా సుత్తి లేకుండా… అధికార పార్టీని ఇరుకున పెట్టిన వైనం.. ఆకట్టుకుంది. శ్వేతపత్రాన్ని ఆంధ్రా అధికారులు తయారు చేశారని ఆరోపించి మొదట అధికారపక్షాన్ని కార్నర్ చేశారు. ఆ తర్వాత అందులోతప్పులు ఉన్నాయని బలంగా వాదించారు. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా శ్వేతపత్రం ఎవర్నో బ ద్నాం చేయడానికి కాదని.. అందులో ఎవరిపైనా విమర్శలు లేవని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియచేయడానికి మాత్రమే రూపొందించారని చెప్పాల్సి వచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…