Minister Ponguleti : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంతో పాటు కొందరు మంత్రులు చాలా దూకుడుగా పరిపాలన సాగిస్తున్నారు.గా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు అధికారులకు ఆసక్తికర హెచ్చరికను జారీ చేశారు. పాలేరు లోని కూసుమంచి మండలం లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.అధికారులు తన జ్ఞానేంద్రియాలని… వారు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా ఉన్నా పాలేరులో మాత్రం లంచం తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం ఉండదని స్పష్టం చేశారు.
అధికారులు కూడా రూపాయి ఆశించకుండా ప్రజలకు పనులు చేసి పెట్టాలని సూచించారు. అధికారులను ఎవరినీ బదిలీ చేయమని.. కానీ వారు పద్ధతి మార్చుకొని విధులు నిర్వహించాలని సూచించారు. లేదంటే.. కనుసైగతో వాళ్లంతట వాళ్లే వెళ్లే విధంగా చేస్తానన్నారు. తన పరిపాలనలో మాటలు ఉండవని, కేవలం కనుసైగలేనని హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అందరి దీవెనలతో గెలిచానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను 100 రోజుల్లో పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి గ్యారెంటీ అమలు జరుగుతుందని ఆయన తెలిపారు.
అనేకమంది ధరణి తో ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కోన్నారు. రెండు మూడు రోజుల్లో మరో శుభవార్త వినబోతున్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు అందరూ కలిసి పనిచేయాలని, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని కూడా అధికారులకు సూచించామని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…