Sajjanar : ఉచిత బ‌స్సు గురించి స‌జ్జ‌నార్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Sajjanar : కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌హిళ‌లకి అంతా మంచే జ‌రుగుతుంది.ముఖ్యంగా మ‌హిళ‌ల‌కి ఉచిత బస్సు ప‌థ‌కం కింద తెలంగాణ‌లో ఎక్క‌డి నుండి ఎక్క‌డికైన తిర‌గవ‌చ్చు అన్న‌ట్టుగా పేర్కొన్నారు.మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత బస్సుల ప్రయాణం విషయంలో కొన్ని సమస్యలు ఎదురువుతున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు.తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్‌ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.

తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ కోరారు. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు కూడా, పల్లెవెలుగు బస్సుల బదులు, ఎక్స్‌ప్రెస్ బస్సులనే ఎక్కుతున్నారు. కొద్ది దూరం ప్రయాణించగానే, బస్సు దిగుతున్నారు. ఇలా కొద్ది దూరం ప్రయాణించేవారు ఎక్కడం, దిగడం జరుగుతూ ఉండటం వల్ల.. ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రయాణ వేగం తగ్గిపోయి, లాంగ్ జర్నీ చేసేవారికి బాగా ఆలస్యం అవుతోంది. ఈ విష‌యంపై స‌జ్జ‌నార్ ఇలా స్పందించారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారన్న సజ్జనార్.. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కేవలం అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని ఆయన తేల్చి చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ కోరారు. మహా లక్ష్మీ పథకం సక్రమంగా అమలు చేయడానికి మహిళలు, చిన్నారులు, ట్రాన్స్‌జెండర్స్‌ మరింత సహకరించాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

Sajjanar interesting comments on free rtc bus travel
Sajjanar

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్‌ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago