CM Revanth Reddy : హ‌రీష్ రావు త‌ప్పు చేస్తే చూస్తూ కూర్చున్నావా స‌బితక్క‌.. సీఎం రేవంత్ ఓ రేంజ్ లో విమ‌ర్శ‌లు..

CM Revanth Reddy : ఏపీ అసెంబ్లీలో మేడిగ‌డ్డ గురించి ఘోర‌మైన డిస్క‌ష‌న్ న‌డుస్తుంది. మేడిగ‌డ్డ ప్రాజెక్ట్ విఫ‌లం గురించి కాంగ్రెస్ నాయ‌కులు ఓ వైపు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌గా, మ‌రోవైపు దానిని పాజిటివ్‌గా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయ‌కులు. ‘మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు చేసినట్లు, దానికి మేమే బాధ్యత వహించాలన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. పదేపదే భాష గురించి, మమ్మల్ని గౌరవించటం లేదని సభలో అంటున్నారు. నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉపయోగించిన భాష గురించి చర్చిద్దామా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కృష్ణా జలాలతోపాటు వివిధ ప్రాజెక్టులను చూసి వచ్చి వాస్తవాల ప్రాతిపదికన చర్చిద్దామని అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించాం. రైతులపై, తెలంగాణ సమాజంపై గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం రావాలి కదా. అందరం కలిసి అక్కడికి వెళ్లి.. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉండేది. దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయటం పద్ధతా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఉన్న అధికారం పోగొట్టారు. అయినా ఆ పార్టీ బుద్ధి మారలేదు.

CM Revanth Reddy comments on sabitha indra reddy
CM Revanth Reddy

మేడిగడ్డ మేడిపండు చందంగా కుంగిపోతే.. అందులో నీళ్లు నింపాలని ఎలా అడుగుతున్నారు? నీటిపారుదల మంత్రులుగా పని చేసిన అనుభవం కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఉంది. వాళ్లకే పెత్తనం ఇస్తాం.. మేడిగడ్డలో ఎలా నీళ్లు నింపుతారు? అక్కడి నుంచి అన్నారం.. తర్వాత సుందిళ్లలో నీళ్లు ఎలా ఎత్తిపోస్తారో పోయమనండి. మొత్తం కుంగిపోయి.. నీళ్లు నింపేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా దెబ్బతింది. ఖర్చు చేసిన రూ. 94 వేల కోట్లు వృథా అయింది. మీరు అవినీతికి పాల్పడకపోతే, మీలో నిజాయతీ ఉంటే, మీరు చెబుతున్నట్లు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు మాత్రమే కుంగిపోతే దాని మీద నిర్ణయాలు తీసుకునేందుకు రమ్మనండి. అక్కడెక్కడికో వెళ్లి ప్రగల్భాలు పలకడమేంటి? అసెంబ్లీకి రమ్మనండి.. చర్చిద్దాం. వాస్తవాలన్నీ సభలో పెడతాం. సాగునీటి ప్రాజెక్టులపై ఎలాగూ శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అప్పుడు చర్చిద్దాం. కాదంటారా.. కాళేశ్వరంపైనే చర్చ అంటే ప్రత్యేకంగా మేమూ సిద్ధంగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మీ స్నేహితుల ప‌త్రిక‌లోను మేడిగ‌డ్డ గురించి త‌ప్పుగా రాయడం చూశాం క‌దా అని రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago