Sarfaraz Khan : ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ మధ్య ఆసక్తికరంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా, రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మూడో టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వీరుడుగా పేరొందిన సర్ఫరాజ్ ఖాన్ కల ఈ టెస్ట్ మ్యాచ్‌తో నిజమైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు తరఫున తొలి టెస్టు మ్యాచ్ ఆడే చాన్స్ దక్కింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రాజ్‌కోట్ టెస్టు లో సర్ఫరాజ్ అరంగేట్రం చేశాడు. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ యంగ్‌స్టర్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.
తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన 311వ ఆటగాడిగా సర్ఫరాజ్ నిలిచాడు. కొడుకు భారత జట్టు టోపీ అందుకోవడంతో అతడి తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. సర్ఫరాజ్‌ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. సర్ఫరాజ్ తండ్రి, స్టార్ కోచ్ అయిన నౌషాద్ ఖాన్ తన కొడుకు అరంగేట్రం చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.. సర్ఫరాజ్ భారత టోపీని ముద్దాడిన తర్వాత నౌషాద్ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు మూడో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
ఇంగ్లండ్ తో మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ యువ బ్యాటర్ వచ్చీ రావడంతోనే అర్ధసెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. రనౌట్ కాకుండా ఉంటే కెరీర్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించి ఉండేవాడేమో! సెంచరీ సాధించకపోయినా అతడి బ్యాటింగ్ తీరు, అతడి దృక్పథం క్రికెట్ అభిమానులను అలరించాయి. మూడో టెస్ట్ లోను మనోడు అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. చూస్తుంటే రానున్న రోజులలో సర్ఫరాజ్‌కి మంచి ఆఫర్స్ వస్తాయని తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…