Sabitha Indra Reddy : వైఎస్సార్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ సీఎం రేవంత్‌కు గట్టి స‌మాధానం ఇచ్చిన స‌బిత‌.. ఏమ‌న్నారంటే..?

Sabitha Indra Reddy : ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీలో రాజ‌కీయం వాడివేడిగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తుపోసుకుంటూ రాజ‌కీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో స‌బితాని అక్క అనుకుంటూ రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించాడు. మ్ముళ్లు తప్పులు చేస్తే సరిచేయాల్సిన బాధ్యత ఒక అక్కగా.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరడుగుల వ్యక్తి హరీష్ రావు అసెంబ్లీలో అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న సబితక్క.. ఒక్కమాట కూడా మాట్లాడట్లేరని రేవంత్ మండిపడ్డారు. తాండూరు, వికారాబాద్, చెవెళ్ల, ప్రాంతాలలో వ్యవసాయం పండటానికి సబిత ఎన్నో ధర్నాలు చేశారన్నారు.

ఆనాడు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పలుమార్లు దీనిపై కలిశారని రేవంత్ గుర్తు చేశారు. అయితే.. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కూడా ఇక్కడ ప్రాజెక్టు కోసం రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి, శిలాఫలకం వేయించారన్నారు. దీని కోసం ఇప్పటికే వందల, వేల కోట్లు ఖర్చు కూడా చేశారన్నారు. కానీ.. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి .. మంత్రిగా ఉన్నా కూడా సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తిచేయలేదన్నారు.దీని వల్ల పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్, చెవెళ్ల, కొడంగల్ ల్ లో తీవ్రమైన పంటనష్టం వాటిల్లిందని అన్నారు.

Sabitha Indra Reddy strong reply to cm revanth reddy
Sabitha Indra Reddy

ఇది పూర్తిగా సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోకపోవడం వల్లనే జరిగిందని రేవంత్ మండిపడ్డారు. దీనిపై సబితా కౌంటర్ ఇస్తూ.. తాను తొలిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఏవిధంగానైతే.. తొందరగా పూర్తి చేశారో, చెవేళ్ల ప్రాజెక్టుకూడా తొందరగా పూర్తిచేయాలని ఆనాటి సీఎం కేసీఆర్ ను అసెంబ్లీలో కోరినట్లు సబితా రిప్లై ఇచ్చారు. తానెక్కడ ప్రాతినిథ్యం వహించినా.. చేవెళ్ల తన కుటుంబం లాంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. శాసనసభలో సబిత మాట్లాడుతూ.. చేవెళ్ల 600 మీటర్ల ఎత్తులో ఉందని, బోర్లు వేసినా నీళ్లురావడం లేదని.. తమకు నీళ్లు కావాలని నాటి సీఎం వైఎస్సార్‌ని కోరాను. అప్పుడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్ట్‌లో రిజర్వాయర్లను కేసీఆర్ పూర్తిచేశారు. మీరు నీళ్లు నింపాలి అని తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago