CM Revanth Reddy : తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సాగిన నియంత పాలన అంతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 13 రోజులు పూర్తయ్యింది. ఈ 13 రోజులుగా వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వర్తించారు. ఒకవైపు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూనే.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. మేం పాలకులం కాదు సేవకులం అని సీఎం రేవంత్ తనదైన మార్క్ వేసే పయత్నం చేస్తున్నారు.ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే.. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచను తొలగించారు అధికారులు. ప్రగతి భవన్‌ను జ్యోతిరావు పూలే అంబేద్కర్ భవన్‌గా పేరు మర్చారు రేవంత్.
సచివాలయంలో చార్జ్ తీసుకున్నారు. మరుసటి రోజు నుంచి ప్రజాభవన్లో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.మరోవైపు సీఎం రేవంత్.. ప్రగతి భవన్‌లో ఉండనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే ప్రతి రోజు సచివాలయానికి వస్తున్నారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు పరిచారు రేవంత్. డిసెంబర్ 9న అసెంబ్లీ ఆవరణంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సచివాలయంలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. సీఎం కాన్వాయ్‌లో కూడా వాహానాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు. అంతేకాదు సొంత వాహానంలోనే తిరుగుతున్నారు. తన కాన్వాయ్ వచ్చే సమయంలో ట్రాఫిక్ ఆపొద్దని కూడా అన్నారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు భరోసా కల్పించేలా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసేలా చర్యలు చేపట్టారు. విద్యా వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చెబుతూ బీఆర్ఎస్ నాయకులకి చుక్కలు చూపించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరంపై జుడిషియల్ విచారణతో పాటు.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…