Deputy CM Bhatti Vikramarka : నువ్వు, మీ నాన్న రాష్ట్రాన్ని నాశ‌నం చేశారు.. కేటీఆర్‌కి భ‌ట్టి స్ట్రాంగ్ కౌంట‌ర్

Deputy CM Bhatti Vikramarka : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల‌లో భాగంగా గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి బలపరిచారు. బీఆర్ఎస్ ఓటమి తరువాత కొలువు తీరిన అసెంబ్లీలో మొదటి చర్చ జరుగుతుండటంతో అందరిలో తీవ్ర ఆసక్తిరేగింది. మేము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అని చెబుతూ.. కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు నీటితో పాటూ కరెంట్ కి కూడా దిక్కు లేదు అంటూ మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అసత్యాలతో అభూత కల్పనలాగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, తాగునీటికి దిక్కులేని పరిస్థితులను తెలంగాణ ప్రజలు అనుభవించారు అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంతా ఆకలి కేకలు తప్ప ఏమీ లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏముంది..? బొంబాయి..బొగ్గు బాయి..దుబాయ్ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.

మధ్యలోనే కల్పించుకున్న భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్.. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామన్నారు. ప్రసంగం మొదలుపెట్టీ పెట్టడంతోనే దాడి సరికాదని కేటీఆర్‌కు హితవు పలికారు. సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షకోట్ల రూపాయలు వృథా చేశారని, పదేళ్లపాటు విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛ అనేదే లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణను రూ. 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు.

Deputy CM Bhatti Vikramarka strong counter to ktr
Deputy CM Bhatti Vikramarka

ప్రతిపక్షం ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సూచనలు చేయాలి తప్ప మాటల దాడి చేయొద్దు అంటూ సూచించారు. ఉమ్మడి పాలన గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు…కానీ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతోనే సలక జనుల సమ్మె వంటివాటితో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని .. తెలంగాణ వచ్చాక రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేంటీ..? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే..బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించి చేసిందేంటీ..? అని ప్రశ్నించారు భ‌ట్టి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago