Babu Gogineni : వేణు స్వామి.. ఈ పేరు ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయింది.ఆయన సినీ, రాజకీయ ప్రముఖుల గురించి ఏవో జాతకాలు చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2023లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేరని ఆయన వెల్లడించారు. ఈసారి డైరెక్టుగా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు. కేటీఆర్ జాతకం ప్రకారం ఆయనకు సీఎం యోగం ఉందని అన్నారు. అయితే 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం కావాలంటే బలమైన గ్రహాలు అనుగ్రహించాలని చెప్పారు. నేను చెప్పింది తప్పైతే జాతకం వదిలేస్తానని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మనోడిని తెగ ఆడుకున్నారు ట్రోలర్స్.
అయితే జ్యోతిష్కులని ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉండే బాబు గోగినేని.. టీవీ చానల్ లైవ్ లో చర్చ నిర్వహిస్తుండగా అందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో జ్యోతిష్యాన్ని తప్పుపట్టారు. వేణుస్వామి జ్యోతిష్యాన్ని, ఆయన ప్రకటనలను ఖండించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని కూడా తన ప్రచారానికి వేణు స్వామి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయనతో దిగిన మార్ఫింగ్ ఫొటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వీళ్లు విపత్తులు వచ్చినప్పుడు ఎందుకు ముందు చెప్పడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఆస్ట్రేలియా- ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో చెప్పిన జాతకం నవ్వు తెప్పించిందని అన్నారు.
జ్యోతిష్యం పేరుతో జరుగుతున్న వ్యాపారాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని బాబు గోగినేని చెప్పారు. జ్యోతిష్యాన్ని వ్యతిరేకించడం మతానికి వ్యతిరేకం కాదు…మోసానికి వ్యతిరేకం అని ఆయన తెలిపారు. వివేకానందుడు, దయానంద సరస్వతి సైతం వ్యతిరేకించారని గుర్తుచేశారు. వేణు స్వామి చెప్పిన వందలో ఒక్కటి మాత్రం నిజమైందని, అది ఫ్లోరిడాలోని హరికేన్ గురించి చెప్పిందని అన్నారు. ఇంతకు ముందు కూడా కొన్ని బండారాలను టీవీ చానెళ్లలో బాబు గోగినేని బయటపెట్టారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…