CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వారిపై ఎలాంటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద, దిగజారుడు రాజకీయాలు చేస్తోందన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు దొంగ అంటూ ఆరోపణలు చేసి.. ఇప్పుడు దావోస్‌లో అదే వ్యక్తితో అలయ్ బలయ్ తీసుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎండగట్టారు. రాహుల్ గాంధీ ఏమో మోడీ, అదాని ఒక్కటే అంటున్నారని.. మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని, అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో సీఎం హోదాలో మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పుడూ గుర్తు చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. కేటీఆర్ దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తే దండగా అన్నారని.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అక్కడికి వెళ్లడం వేస్ట్ అన్నారని.. మరి ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి సైతం దావోస్ వెళ్లారని.. దానిపై ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు హాజరై అక్కడ మీడియాతో మాట్లాడిన తీరు నవ్వల పాలు చేసిందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కొందరు బీఆర్ఎస్ అభిమానులైతే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అసెంబ్లీలో, ఇతర సందర్భాల్లో ఇంగ్లిష్‌లో ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్స్, రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ వీడియోలు పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరు కేసీఆర్ కుమారుడు, మాజీ మంత్రి కేటీ రామారావును, రేవంత్‌ను పోల్చుతూ వీడియోలు, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక రేవంత్ మద్దతుదారులైతే ఆయన అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్‌తో సమావేశమైన ఫోటోలు, వివిధ దేశాల ప్రతినిధులు, వివిధ కంపెనీల సీఈవోలు, యజమానులతో జరిపిన సమావేశాలు వివరాలతో దావోస్ పర్యటనలో ఆయన ఏం సాధించారన్నది బలంగా ప్రచారం చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…