90s Web Series : శివాజి… ఈ పేరు బిగ్ బాస్ షోతో మరోసారి తెగ మారుమ్రోగింది.ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ఎంతగానో అలరించిన శివాజి ఇటీవల బిగ్ బాస్ సీజన్7లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం సినిమాల్లో నటననే అదరగొట్టకుండా.. తన క్యారెక్టర్ ను కూడా అలాగే అందరికీ చూపించి మంచి మార్కులే కొట్టేశాడు. ప్రతీ ఒక్కరికి శివాజి.. శివన్నలా మారిపోయాడు. శివాజి 1997లో మాస్టర్ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.. ఆ తర్వాత అనేక అద్భుతమైన చిత్రాలతో వచ్చి అందరినీ అలరించాడు. కొన్ని మంచి హిట్స్ కూడా అందుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.
శివాజి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, ప్రేమంటే ఇదేరా, ఫిల్మ్ నగర్, యువరాజు, బ్రహ్మచారులు, కళాశాల, ప్రియమైన నీకు, కుషీ, భార్య, చిరంజీవులు, స్నేహితుడు, ఫ్రెండ్స్, ప్రియనేస్తమా, చంద్రవంశం, స్నేహితులు, మనసుంటే చాలు, సందడే సందడి, అదృష్టం, ఇంద్రుడు, శివ రామరాజు ఇలా అనేక సినిమాల్లో నటించాడు. ఒట్టేసి చెబుతున్నా, ఆయుధం, శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాలా బిర్లా మధ్యలో లైలా, మంత్ర బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం, అయ్యారే, పవిత్ర, బూచమ్మ బూచోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు ఉన్నాయి. అయితే అనుకోకుండా ఆయన సినిమాలకి చాలా దూరమయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి తెరపై కనిపించాడు. ఈ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని మరోసారి హీరో అయ్యాడు. ఇక ఈ షో నుంచి వచ్చిన వెంటనే ఆయన నటించిన 90స్ వెబ్ సిరీస్ విడుదల కావడం.. అందులో శివాజి నటనకు మంచి మార్కులు పెరగడంతో ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. బుల్లితెరపై ఆయన్ను చూసిన ప్రతీ ఒక్కరూ ఆయన తాజా వెబ్ సిరీస్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సిరీస్ లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా శివాజీ ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సిరీస్ కోసం శివాజీ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ కంటే రెండింతలు ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నారని ఈ సిరీస్ కోసం దాదాపుగా 70 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ..ఇక శివాజి త్వరలో వెండితెరపై కనిపించి కూడా సందడి చేయనున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న కూర్మ నాయకి అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో శివాజి కనిపించబోతున్నట్లు ఆయన ఇటీవల వివరించాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…