Ramya Rao : తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం బాగాక్షీణించిందని.. ఆయన మంచానికే పరిమితం అయ్యారని.. ఇక, రాజకీ యంగా ఆయన కోలుకోలేరని.. అతా ఆయన కుమారుడే చూసుకుంటారని.. ఇటీవల సోషల్ మీడియాలో సమాచారం హల్చల్ చేసింది. అయితే.. దీనిపై బీఆర్ ఎస్ నాయకులు కానీ, ఇతర పార్టీ ముఖ్యులు కానీ.. స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ నడుస్తున్న వీడియోను షేర్ చేయడం ద్వారా.. ఆ గ్యాసిప్‌లకు కేసీఆర్ ఫ్యామిలీ ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.
ప్రస్తుతం వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకునేందుకు.. మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఆయన గజ్వేల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న నేపథ్యంలో మూడు మాసాలలోగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆయనను సంప్రదించింది. దీనిపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంటిలోనే ఉండి.. ప్రమాణం చేయడమా.. లేక.. ప్రత్యేక సదుపాయంతో అసెంబ్లీకి హాజరు కావడమా? అనే విషయంపై దృష్టి సారించినట్టు తెలిసింది. మొత్తానికి కేసీఆర్.. కుటుంబం తాజాగా విడుదల చేసిన వీడియో బీఆర్ ఎస్ నేతలకు ఆనందం పంచుతోంది.
సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు ఇటీవల కేసీఆర్ ప్రమాదానికి గల కారణాలని తెలియజేస్తున్నారు. ఇంట్లో గొడవల్లే కేసీఆర్ కిందపడి గాయపడ్డాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రమ్యరావు స్పందించారు.కవితని అడగలేదు. కేటీఆర్‌ని అడిగిన. డిన్నర్ అయింది. చేతులు కడుక్కునే సమయంలో లుంగీతో నడుస్తుండగా, ఆయన లుంగీ తగిలి కింద పడిపోయాడు. ఆ సమయంలో మేము ఎవరం లేము అని కేటీఆర్ అని అన్నాడు. అయితే గొడవలు జరుగుతున్న మాట నిజమే. అయితే కేటీఆర్ హరీష్ గొడవల విషయానికి వస్తే ఆ సమయంలో కేటీఆర్ లేడని చెబుతున్నాడు. మరి అక్కడ ఎవరున్నారు, ఏం జరిగింది అని కొద్ది మందికి తెలుసు. పంచె తట్టుకునే పడ్డాడని అంటున్నారు అని రమ్య రావు చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…