CM KCR : తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. డిసెంబర్‌లో ఎలక్షన్స్ జరగనుండగా, ఈ సారి ఎవరికి టిక్కెట్స్ ఇవ్వబోతున్నాడు, ఎవరిపై వేటు వేయబోతున్నాడనే చర్చ మొదలైంది. ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని అంటున్నారు. ఆగస్టు-18న 80 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించాలని కేసీఆర్ ముహూర్తం కూడా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఏ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని అంతా చర్చ జరుగుతున్న సమయంలో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఓ లిస్ట్ అయితే నెట్టింట హల్ చల్ చేస్తుంది.
మేడ్చల్ నుండి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్- వివేకానందగౌడ్, మల్కాజిగిరి-మైనంపల్లి హన్మంతరావు, ఎల్బీనగర్- దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల- కాలె యాదయ్య, రాజేంద్రనగర్- ప్రకాశ్‌గౌడ్, పరిగి- మహేష్ రెడ్డి, వికారాబాద్ – ఆనంద్, కూకట్ పల్లి- మాధవరావు, శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ, ఇబ్రహీంపట్నం – మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ముషీరాబాద్- ముఠా గోపాల్, ఖైరతాబాద్- దానం నాగేందర్, జూబ్లిహిల్స్- మాగంటి గోపినాథ్, సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి- ఆనంద్ గౌడ్ ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నారు ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్‌పై ఎలక్షన్ పిటిషన్‌లో ట్రయల్ ప్రారంభమైంది. బుధవారం నాడు కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై విచారణ జరగనుంది. మొత్తానికి చూస్తే వనామా అనర్హత వేటుతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ నెలాఖరులోపు ఎంతమందిపై వేటు పడుతుందో..? ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది..? ఒకవేళ ఈ నెలాఖరుకల్లా క్లియర్ కాకపోతే రానున్న ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలకు మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇస్తారా..? లేకుంటే పక్కనెట్టేస్తారా..? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30 కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉండగా.. అందులో 28కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైనే కావడం గమనార్హం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…