CM Chandra Babu : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జూన్ 13, గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సాయంత్రం 4.41కు ఛార్జ్ తీసుకోనున్నారు. అయితే బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తొలిగా ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారనే అంశంపై సస్పెన్స్ వీడింది. మొత్తం ఐదు ఫైల్స్‌పై సీఎం చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ నిర్వహణ దస్త్రంపై చేయనున్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది.
ప్రజలను అత్యంత భయకంపితుల్ని చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేయనున్నారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చింది. ఇక 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అప్పటికి రూ.200 ఉన్న పింఛన్‌ను 5 రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు. ఆ తర్వాత దాన్ని రూ.2,000లకు పెంచారు. 2024 ఎన్నికల ప్రచారంలో రూ.4,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆగస్ట్ నుంచి లబ్ధిదారులకు రూ.4,000ల పింఛన్ అందనుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అల్పాహారం, భోజనాన్ని 5 రూపాయలకే అందించారు.
పేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లను కేవలం టీడీపీ ప్రారంభించిందన్న కక్షతో జగన్ మూసివేయించారు. ఐనా తెలుగుదేశం నేతలు పలుచోట్ల అన్న క్యాంటీన్లను నిర్వహించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల దస్త్రంపై పెట్టనున్నారు.యువత ఉన్నతస్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. ఈ సమస్య పరిష్కారానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీనిచ్చారు. చంద్రబాబు ఐదో సంతకాన్ని ఈ దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…