CM Chandra Babu : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు అంతటా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలుపెడతామని సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇక పరదాలు కట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి మీడియాతో మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి.
‘మా కులదైవం వేంకటేశ్వరుడు, ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలెడుతా. శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగాను. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించెందుకు వచ్చే సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినా నా కులదైవమే నన్ను కాపాడాడు. దేవాన్ష్ పుట్టిన రోజు సంభర్భంగా ప్రతి ఏటా తిరుమలలోని అన్నదానం చేయించడం అనవాయితీ. తిరుమల పవిత్రమైన దివ్యక్షేత్రం.. ఈ క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తిరుమలలో ఉంటే వైకుంఠంలో ఉన్నట్లు భావన ఉంటుంది’. ‘తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారు. విపరీతమైన రేట్లు, బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల విక్రయం ఉండకూడదు. మా ప్రభుత్వ హయాంలో గ్రీనరీ పెంచాం. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం అంటూ విచ్చలవిడిగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇష్టానుసారం తమకు నచ్చిన వారికి పదవులు ఇచ్చారు. పెళ్లిళ్లు పేరంటాలకు స్వామి వారిని అమ్మే ప్రయత్నం చేశారు. ఎర్ర చందనం స్మగ్లర్లలు సీట్లు ఇచ్చారు. దృఢ సంకల్పంతో చెడును అణచి వేస్తా అని చెప్పుకొచ్చారు.
అయితే ఎన్నికల ఫలితాలకి ముందు చంద్రబాబు ఏబీఎన్‌తో ముచ్చటించారు. ఎన్డీయే విజయం తధ్యమని చంద్రబాబు చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు.. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, మాయలను తిప్పికొట్టగల అస్త్రాలు తన దగ్గర ఉన్నాయన్నట్టు చెప్పుకొచ్చారు. జగన్ ఏలుబడిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే యాక్షన్ ప్లాన్ బాబు దగ్గర ఉందని అన్నారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేసే వారి తాట తీస్తానని చంద్రబాబు అన్నారు.నేను ఏం చేస్తానో చూస్తారంటూ ఆయన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎలాంటి యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళతారో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…