CM Chandra Babu : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌న్.. న‌వ్వ‌లేక దండం పెట్టేశాడుగా..!

CM Chandra Babu : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అదే రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం మ‌నం చూశాం. కూటమి కట్టడానికి, కూటమి విజయానికి పవన్‌ కల్యాణే కారణమని చెబుతున్న చంద్రబాబు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. అయితే మంగ‌ళ‌వారం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తొలిసారిగా సచివాలయం వచ్చిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబును కలిశారు.

అనంతరం రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌‌లతో పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. అదే క్ర‌మంలో ప‌వ‌న్ కొన్ని జోకులు వేసిన‌ట్టుగా కూడా తెలుస్తుంది. ఆ జోకుల‌కి చంద్ర‌బాబు కూడా తెగ న‌వ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికిన సీఎం, ఆలింగనం చేసుకోవ‌డం,. అనంతరం పేషీలో కూర్చోని సరదాగా ముచ్చటించుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

CM Chandra Babu fun with pawan kalyan
CM Chandra Babu

ఇక వారిద్ద‌రు ముచ్చటిస్తూ నవ్వుకున్నారు కూడా.!. భేటీ కావడానికి వచ్చిన పవన్‌కు సీటులో నుంచి లేచి ఎదురెళ్లి మరీ.. ఆలింగనం చేసుకున్న సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. సీఎం చాంబర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించిన పవన్.. ‘మీరు ఆ గుర్తుకు హుందాతనం తెచ్చారు సార్’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ‘ధన్యవాదాలు పవన్’ అని అన్నారు.ఇక బుధవారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇక ఆయ‌న కూడా రంగంలోకి దిగి రానున్న రోజుల‌లో అనేక మార్పులు తీసుకొచ్చే విధంగా అడుగులు వేయ‌బోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago