Chiranjeevi : 4 ఏళ్ల‌ క్రితం ధ‌రించిన ష‌ర్ట్‌తో మ‌ళ్లీ మెరిసిన చిరంజీవి.. సోష‌ల్ మీడియాలో ఫొటో వైర‌ల్‌..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి. ఈ పేరుకి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. స్వ‌యంకృషితో ఈ స్థాయికి ఎదిగిన చిరంజీవి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అభిమానుల‌ని సంపాదించుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులో కుర్రాళ్లకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు యువ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి ముఖ్య అతిథిగా హాజ‌రు అవుతూ వారికి త‌న వంతు స‌పోర్ట్ ను అందిస్తున్నాడు. అయితే రీసెంట్‌గా చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి ధ‌రించిన ష‌ర్ట్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సైరా సినిమా తమిళ వెర్షన్ ప్రమోషన్ సమయంలో చిరంజీవి డ‌బుల్ పాకెట్స్‌తో బ్లూ క‌ల‌ర్ ష‌ర్ట్‌లో ద‌ర్శ‌నమివ్వ‌గా మ‌ళ్లీ నాలుగేళ్ల‌కు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదే టైపు ష‌ర్ట్‌తో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధార‌ణంగా మెగాస్టార్ వంటి సెల‌బ్రిటీలు వేసిన ష‌ర్ట్ వేసే అవ‌కాశం ఉండదు. కానీ చిరంజీవి అప్పుడెప్పుడో వేసిన ష‌ర్ట్ మ‌ళ్లీ వేయ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే రెండూ కూడా బ్లూ క‌ల‌ర్‌లో ఉన్నా కూడా కొంచెం సారుప్య‌త క‌నిపిస్తోంది. అయిన వేసిన‌ షర్టు ఇంకోసారి వెయ్యకూడదన్న రూల్ ఏమైనా వుందా..? షర్ట్ మాత్రమేనా, లోపల బనియన్ గురించి కూడా ఏమైనా పరిశోధన చేశారా..? అన్నట్లుగా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Chiranjeevi wore 4 years back shirt recently
Chiranjeevi

ఇదిలా ఉంటే చిరంజీవి అంజి సినిమా కోసం ఒకే చొక్కాను రెండేళ్ల పాటు వేసుకున్న విష‌యం విదిత‌మే. అంజి సినిమాకి సంబంధించి ఒక్క క్లైమాక్స్ మాత్రమే రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామ‌కృష్ణ‌. దాంతో క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అంత పెద్ద హీరో అయినా కూడా కొత్త హీరోలా అంజి కోసం కష్టపడ్డాడని.. కానీ ఈ చిత్రం ఫలితం నిరాశ పరిచిందని చెప్పాడు కోడి. అయితే అంజి క్లైమాక్స్ కోసం రెండేళ్ల పాటు ఒకే చొక్కా నలగకుండా చూసుకుంటూ ఉతకకుండా వేసుకున్నారు చిరంజీవి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago