Chiranjeevi : చిరుతోపాటు ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్న వారు ఎవ‌రు… దాని వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి..?

Chiranjeevi : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సారి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవితోపాటు.. మాజీ ఊపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ అవార్డ్ కేవలం అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డ్ అందుకున్న హీరో మెగాస్టార్ కావడం విశేషం. వీరికి మాత్రమే కాకుండా భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు.

అయితే పద్మ అవార్డులపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. పద్మ అవార్డులు అందుకున్న వారికీ నగదు బహుమానాలు, అనేక రాయతీలు దక్కుతాయని భవిస్తూ ఉంటారు. అయితే అలాంటిది ఏమీ ఉండదు. పద్మ అవార్డు అనేది కేవలం గౌరవం మాత్రమే. పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా దక్కే నగదు, ఇతర రాయతీలు ఏమీ ఉండవు. చాలా మంది అనుకుంటున్నట్లు రైళ్లలో, విమానాల్లో రాయతీలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ తో దక్కిన గౌరవం పద్మ విభూషణ్ అవార్డు. పద్మ అవార్డు దక్కిన వారి రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి సంతకం ఉన్న సర్టిఫికెట్, ఒక పతకం అందజేస్తారు. వీరికి దేశమంతా గుర్తింపు, గౌరవం దక్కుతాయి అంతే. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చిరంజీవికి గౌరవ డాక్టరేట్ దక్కింది.

Chiranjeevi what benefits he will get for padma vibhushan
Chiranjeevi

ఇక మొదట ఏ సినిమాలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా, నెగటివ్ రోల్స్ వచ్చినా ప్రతి పాత్రను నటించేవారు చిరంజీవి. ఆ తర్వాత తన డాన్స్ తో, తన నటన కౌశలంతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. ఖైదీ ముందు చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమా, ఆ తరువాత చిరంజీవి చేసిన సినిమాలు మరో ఎత్తని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago