CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్‌లతో వార్నింగ్‌లు ఇవ్వడమే కాదు నవ్వులు కూడా పూయిస్తాడు.కోస్గిలో స్వయం సహాయక మహిళా సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ మహిళతో సరదాగా మాట్లాడారు.బాహుబలి సినిమా ప్రస్తావన తెచ్చారు రేవంత్ రెడ్డి. ఆ సినిమాలో కాలకేయుడి పాత్ర గురించి చెప్పిన సీఎం రేవంత్.. కాలకేయుడిది మా ఊరే అని తెలిపారు. సీఎం రేవంత్ తో మాట్లాడిన ఓ మహిళ.. బాహుబలిలో కాలకేయ పాత్ర పోషించిన నటుడు ఎవరో కాదు.. నాకు మరిది అవుతాడు అని సీఎం రేవంత్ తో చెప్పింది.
ఓసారి ఆయనను కొడంగల్ కు తీసుకుని రావాలని ఆ మహిళతో చెప్పారు సీఎం రేవంత్. కాలకేయుడి పాత్ర పోషించిన నటుడిది మా కొడంగల్ అని తన పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులతో చెప్పారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా అక్కడ కాసేపు నవ్వులు పూయించారు. మరో మహిళ నా భర్త చేసిన త్యాగానికి నెలకు 8 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీ భర్త నిన్ను ఎలా చదివించారో నువ్వు కూడా అలా చదివించాలని, ఈ రోజుల్లో పిల్లలకి చదువు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకి ఆమె తెగ నవ్వేసింది.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన ఆయన, నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.4,369 కోట్లు విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాలద్వారా పంటల కొనుగోళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…