Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో లెజెండ్ గా ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు తో చిరును గౌరవించడం జరిగింది. నేడు జరిగిన ఒక ఈవెంట్ లో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు మెగాస్టార్ చిరంజీవి లు చీఫ్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో చిరును ఉద్దేశించి విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, సినిమా మీద, తెలుగు సినిమాలో పని చేసే డైరెక్టర్లు, యాక్టర్ల మీద, తను వచ్చిన తరువాత డాన్స్ మార్చేశారు. అప్పటి వరకు ఉండే డాన్స్ ఒకలా ఉంటే, తను వచ్చాక ఇలా కూడా చేయవచ్చా అనే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ డాన్స్ లో తీసుకు వచ్చారు.
సినిమా స్క్రీన్ మీద హీరోలు చేసే ఫైట్ లు ఒకలా ఉంటే, తను వచ్చినా తరువాత ఫైటింగ్ స్టైల్ మార్చేశారు. తను వచ్చిన తరువాత పెర్ఫార్మెన్స్ మార్చేశారు. తను వచ్చిన తరువాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు. తనను చూసి, ఊర్ల నుండి ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలు అవుదాం అని సిటిలకి వచ్చారు. ది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, అవర్ పద్మ విభూషణ్, అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధిక, శారద, జగ్గయ్య వంటి పెద్ద వారితో కోర్టు సీన్ చేయాల్సి ఉంది. అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ రోప్‌తో మీద ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయిందని చెప్పడంతో.. నేను వెళ్లి బోనులో నిల్చున్నాను. దీంతో ఇంత లేటుగా వచ్చానని నిర్మాత అరిచారు’ అని చెప్పారు.
పాండి బజార్ ఘటనని గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి.. అది 1977 ప్రాంతం. మద్రాస్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులవి. ఒక రోజు ఓ స్నేహితుడు సరదాగా టీ తాగి వద్దాం రమ్మంటే పాండీ బజార్ కు వెళ్లాను. అక్కడకు సాయంత్రం చాలామంది వస్తుంటారు అని చెబితే, సరేనని వెళ్లాను. వారు నన్ను చూడగానే… ఏంట్రా నీ స్నేహితుడా, ఏ ఊరు, ఏం పేరు? అని నా ఫ్రెండ్ ని అడిగారు. శివశంకర వరప్రసాద్ అని పేరు చెప్పి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఏంటి… సినిమాల్లో వేషాల కోసం వచ్చావా? అన్నారు. అవునండీ అన్నాను. ఏం వేషాలు? అన్నారు. ఏముందండీ… అవకాశం దొరికితే హీరోగా చేద్దామని… అన్నాను.
వారు ఇంకొక వ్యక్తిని పిలిచి… చూడు, వీడు ముక్కు ముఖం ఎంత చక్కగా ఉన్నాడో… వీడికే దిక్కులేదు… నువ్వు హీరో అయిపోతావా? మేమంతా ఇదే పరిస్థితిరా బాబూ… చాలు చాల్లే… అంటూ నెగెటివ్ గా మాట్లాడారు. ఎంతో హుషారుగా వెళ్లిన వాడ్ని, వాళ్ల మాటలతో తీవ్ర నిరుత్సాహంతో తిరిగి వచ్చాను. నేను ఎప్పుడూ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, నాకు గురువులు ఎవరూ లేరు. నా గురువు ఆంజనేయ స్వామే. నా బాధలు ఆయనతో చెబుతాను… ఆయన నాకు సమాధానం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన సూచనలు తీసుకుంటాను, అలాగే నడుచుకుంటాను. . ఆ క్షణం నుంచి మళ్లీ పాండీ బజార్ వైపు వెళ్లలేదు. మనం నెగెటివిటీ ఉన్న చోటికి వెళితే మనం కూడా ఆ ప్రభావానికి లోనవుతాం” అని చిరంజీవి వివరించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…