Kumari Aunty : చ‌దువుకోలేద‌ని బాధ‌ప‌డే వారి కోసం కుమారి ఆంటీ ఎలా మాట్లాడిందో చూడండి..!

Kumari Aunty : ‘హాయ్ నాన్న చెప్పండి.. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ.. కొంచెం కొంచెం తినండి’ అంటూ చాలా తియ్య‌గా మాట్లాడి సోష‌ల్ మీడియాలో తెగ ఫేమ‌స్ అయిన కుమారీ ఆంటీ చాలా ఫేమ‌స్ అయింది. ఆమె ‘ టూ లివర్స్ ఎక్స్ ట్రా.. మీది థంజెడ్ అయ్యింది’ అని ఆమె మాట్లాడిన మాట‌ల‌ని తెగ ట్రోల్ చేస్తూ ఆమెని చాలా పాపుల‌ర్ చేశారు. అయితే త‌న‌పై ఎంత నెగ‌టివిటీ జ‌రిగిన కూడా దానిని పాజిటివిటీని సొంతం చేసుకుంది కుమారి ఆంటీ. ఈమెకు ఫిదా అయిపోయిన ప్రజలు.. కుప్పలు తెప్పులుగా ఆమె హోటల్ దగ్గరకు వెళ్లి తినడమే కాకుండా.. ఆమె నుండి యూట్యూబర్లు చిన్న బైట్ అయినా తీసుకునేవారు. దీంతో ఓ చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. అనుకోకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్‌గా మారింది.

డిజిటిల్ మీడియాను ఒక తాటిపైకి తెచ్చేందుకు, కంటెంట్ క్రియేటర్లకు అండగా నిలిచేందుకు డిజిటల్ మీడియా ఫెడ‌రేష‌న్ వెబ్ సైట్ ను ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఇక ఇప్పుడు దానికి సంబంధించి ఆరిజిన్ డే వేడుక‌లు నిర్వ‌హించారు. ఆ కార్య‌క్ర‌మంలో ఎంతోమంది సోష‌ల్ మీడియా స్టార్స్ కూడా పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈ మ‌ధ్య ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ పాల్గొని స్టేజ్ మీద స్పీచ్ దంచికొట్టారు. ఆమె మాట్లాడిన మాట‌ల‌కు అక్క‌డికి వచ్చిన సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయి.. క్లాప్స్ కొట్టారు. ఆమె ఏం మాట్లాడారంటే? షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి నాకు. ఇంత పేరు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు అస‌లు. అంద‌రికీ పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. నేను ఎక్క‌డ ఉంటానో, ప్ర‌పంచం అంటే ఏంటో తెలియ‌ని న‌న్ను ఇక్క‌డ వ‌ర‌కు, ఇంత మంది ముందుకు తీసుకొచ్చారు. నిజంగా సోష‌ల్ మీడియాకి థ్యాంక్యూ. న‌న్ను స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున ధ‌న్య‌వాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఆత్మ‌విశ్వాసం ఉంటే ఎలాగైనా ముందుకు వెళ్లొచ్చు.

Kumari Aunty superb speech for people who not studied well
Kumari Aunty

చ‌దువు లేద‌ని బాధ‌ప‌డేదాన్ని. అప్పుడు మా అమ‌మ్మ‌, నాన్న‌మ్మ ఒక‌టి చెప్పారు. చ‌దువులేద‌ని బాధ‌ప‌డొద్దు. భ‌క్తికి, ముక్తికి చ‌దువులెందుకు? ఆత్మ శాంతి ఉంటే చాలు అదే దైవ‌ము. చెరువులోన చేప‌కు ఎవ‌రు ఈత నేర్పెను? బావిలోని క‌ప్ప‌కు ఎవ‌రు భాష నేర్పెను? అడ‌విలోని హంస‌కు ఎవ‌రు పాట నేర్పెను? చెట్టు మీద కోయిల‌కు ఎవ‌రు కూత నేర్పెను? పుట్ట‌లోని పాముకు ఎవ‌రు బుస‌లు నేర్పెను? పుట్టిన బాలుడికి ఎవ‌రు ఏడుపు నేర్పిరి? అని నాకు ధైర్యం చెప్పారు. ఇవే కాదు చాలా మంచి మాట‌లు చెప్పారు’’ అని తెలిపారు. చ‌దువు ఒక్క‌టే కాదు. నీ ఆత్మవిశ్వాసం, ప‌ని త‌నంతో, చేసిన‌దానికి ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా ముందుకు వెళ్తే మంచి జ‌రుగుతుంద‌ని అన్నారు. నిజంగా నేను ఇప్పుడు ఇలా ఊహించుకోలేదు. పెద్ద‌ల మాట వింటే ఎప్ప‌టికైనా విజ‌యం సాధిస్తామ‌ని నా విష‌యంలో నిజం అయ్యింది. అందుకే, నేను చెప్పేది ఏంతంటే? పెద్ద‌ల మాట‌ వింటే విజ‌య‌మే కానీ, అప‌జ‌య‌మే ఉండదు” అంటూ త‌న స్పీచ్ ముగించారు కుమారీ ఆంటీ.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago