Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ మాస్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పాలి . తెలుగులో ఆయన యాక్ట్ చేసిన ఎన్నో చిత్రాలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు అన్నగారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానర్స్‌కు ఆయన అసలు సిసలు ట్రెండ్ సెట్టర్. ఎవరైనా కాలంతో పాటు నడుస్తారు. కానీ, టైమ్‌ను తన వెంట నడిపించుకున్న కథానాయకుడు యన్టీఆర్ అని చెప్పాలి. ఇక తెలుగునాట హిందీ రీమేక్ మూవీస్‌కు అప్పట్లోనే ఓ స్పెషల్ క్రేజ్ తీసుకు వచ్చిందీ అన్నగారు అని చెప్పాలి. ఆయన తన 52వ ఏట ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్ లో నటించగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
ఎన్టీఆర్ సోలో హీరోగా కాకుండా పలు మల్టీ స్టారర్ చిత్రాలు కూడా చేశాడు. చిరంజీవితో కలిసి పలు చిత్రాలు చేశాడు. తిరుగులేని మనిషి చిత్రంలో న్యాయవాది రాజాగా ఎన్టీఆర్, క్లబ్‌లో పాటలు పాడే కిషోర్‌గా చిరంజీవి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.అయితే ఓ సారి చిరంజీవిని ఎన్టీఆర్ సినిమా మధ్యలో నుండే తీసేసారట. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కొండవీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం 1981 అక్టోబర్ 07న విడుదలైంది.
కొండవీటి సింహం చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు మోహన్ బాబు కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. మోహన్ బాబు పాత్రకు తొలుత చిరంజీవిని అనుకోగా, కానీ ఆయన సరిగ్గా చేయలేకపోవడం వల్లనే ఆ ఛాన్స్ మోహన్ బాబుకి దక్కింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం చిరంజీవిని ఎంపిక చేసి అతనిపై 5 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. కానీ ఆయన ఎన్టీఆర్‌కి ఎదురు తిరిగి డైలాగ్‌లు చెప్పడంలో ఇబ్బంది పడ్డారట. ఎన్టీఆర్ ఆ సినిమా కోసం కేవలం నెల రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో చిరంజీవితో సినిమా షూట్ చేస్తే ఆలస్యమవుతుందని మోహన్ బాబుని తీసుకున్నారట. అలా చిరంజీవి.. ఎన్టీఆర్ సినిమా నుండి తొలగించబడ్డాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…