Arshdeep Singh : ప్రస్తుతం ఇండియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. తొలి టీ 20 లో ఇండియా విజయం సాధించగా, రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం అర్ష్‌దీప్ సింగ్ అని చెప్పాలి. ఆసియా కప్‌లో మంచి క్యాచ్ చేజార్చి ఇండియా ఓడిపోయేలా చేసి విమర్శలపాలైన అర్ష్‌దీప్ సింగ్ గత రాత్రి మ్యాచ్‌లో మొత్తం 5 నోబాల్స్ వేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీలంకపై బౌలింగ్ వేయడానికి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్… తన మొదటి ఓవర్ లోనే ఏకంగా హ్యాట్రిక్ నో బాల్స్ ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు ఆ ఒక్క ఓవర్లోనే మొత్తం 19 పరుగులు సమర్పించుకున్నాడు.
ఒకే ఓవర్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్, రెండో ఓవర్‌లో మరో రెండు నో బాల్స్ వేశాడు. మొత్తంగా 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్, 5 నో బాల్స్ వేసి.. టీమిండియా తరుపున ఒకే మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు… 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించిన అర్ష్‌దీప్ సింగ్, 2 ఓవర్లు బౌలింగ్ చేసి అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇంతకుముందు అశ్విన్ 2 ఓవర్లలో 41 పరుగులు ఇవ్వగా రవీంద్ర జడేజా 38 పరుగులు ఇచ్చాడు.. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనే ఈ ఫీట్లు సాధించారు.
2022లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ సింగ్, ఒకే ఏడాదిలో 12 నో బాల్స్ వేశాడు. 2022 జనవరి నుంచి ఏడాది కాలంలో భారత మిగిలిన బౌలర్లు అందరూ కలిసి 11 నో బాల్స్ వేస్తే, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 12 నో బాల్స్ వేశాడు. అయితే ప్రాక్టీస్ లేకపోవడం వల్లే అర్ష్‌దీప్ సింగ్ ఇలా బౌలింగ్ చేశాడని దినేశ్ కార్తీక్ కామెంట్ చేశాడు .. ‘అర్ష్‌దీప్ సింగ్ జ్వరంతో ప్రాక్టీస్‌కి దూరంగా ఉండగా, జ్వరం నుంచి కోలుకుని నేరుగా మ్యాచ్‌లో బరిలో దిగడంతో రిథమ్ అందుకోలేకపోయాడు. ఒక్క మ్యాచ్ కారణంగా అర్ష్‌దీప్ సింగ్ టాలెంట్‌ని తక్కువ అంచనా వేయకూడదు…’ అంటూ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అతనికి సపోర్ట్‌గా నిలిచాడు.అయితే అర్ష్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ నోబాల్ వేసినప్పటి నుంచే అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. ఇక శ్రీలంకపై టీమిండియా ఓటమిపాలవడంతో ఆ ఆగ్రహంతో ఉన్న అభిమానులు మరీ ఎక్కువ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…