Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరోలలో చిరంజీవి ఉన్నత స్థానం గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు. అయితే కార్ల విషయంలో చిరు చాలా ఆసక్తి చూపుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కారు టయోట వెల్‌ఫైర్ కు తన గ్యారేజీలో చోటిచ్చారు. నలుపు రంగులో ఉన్న కారును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ కారు ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో రూ1.19కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహనం రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి విచ్చేశారు.
కొణిదెల చిరంజీవి పేరుతో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోగా, చిరు ఈ కారు కోసం ఫ్యాన్సీ నంబర్ టీఎస్09జీబీ1111 కొనుగోలు చేశారు. దాదాపుగా రూ.4.7లక్షలు చెల్లించి ఆ నంబర్‌ను కొన్నారని సమాచారం. వాహనం రిజిస్ట్రేషన్ కోసం డిజిటల్ సంతకం చేయాల్సి ఉండటంతో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని మెగాస్టార్ స్వయంగా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవికి 1111 నంబర్ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి కారుకు అదే నంబర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొన్న కారుకు కూడా సేమ్ నంబర్ తీసుకున్నారు. ఆ నంబర్ కోసం అంత ఖర్చు పెట్టారు.
చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికి వస్తే… మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా తమన్నా భాటియా నటిస్తున్నారు. చిరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుంది. అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, ఆమెకు జోడీగా సుశాంత్ కనిపిస్తారేమో అని అందరు అనుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…