Asalu Movie : ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో డైరెక్టర్ కమ్ నటుడు రవిబాబు ముందుంటారు. ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో ఆయన శైలివేరు అని చెప్పాలి.. దివంగత నటుడు చలపతిరావు తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. అల్లరి సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా, ఆ తర్వాత అనసూయ, అమరావతి, అవును వంటి సినిమాలను రూపొందించారు. ఈ చిత్రాలు హిట్స్ కావడంతో.. మరోసారి అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చాలా కాలం గ్యాప్ తర్వాత రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అసలు’.
పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అటు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఏప్రిల్ 13 నుంచి ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా గత అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, దానికి మంచి స్పందన వచ్చింది.. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ అంశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపించింది.
ఓ దారుణమైన హత్యను చేధించే పనిలో ఉంటాడు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ హత్య వెనుక ఓ రహస్యాలు ఏమిటి ఆ నలుగురు అనుమానితులకు హత్యకు సంబంధం ఏంటి అనే అంశాలను సినిమాలో చూడొచ్చు. తాజాగా ఈటీవీ విన్ ‘అసలు’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను చేస్తూ.. సినిమా చూసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ హెచ్చరించింది. ఇక రవిబాబు మొదటనుంచీ తీస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు అన్నీ ‘అ’ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ‘అల్లరి’, ‘అనసూయ’, ‘అమరావతి’, ‘అవును 1,2’ ఇలా.. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మొదటి అక్షరం అ వచ్చేలా ‘అసలు’ అని పేరు పెట్టారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…