మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి .ఆ సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసినా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే క ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి స్టేట్ రౌడీ ఒకటి. ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇక ఆ రోజుల్లోనే ఏకంగా నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్ రాబట్టిన సినిమాగా స్టేట్ రౌడీ రికార్డు సృష్టించి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ సినిమా 177 ప్రింట్లతో థియేటర్లోకి రాగా విడుదలైన కొద్ది రోజుల వరకు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
షూటింగ్ టైం లోనే ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే శశి భూషణ్ ఈనాడు విలేఖరి పై దురుసుగా ప్రవర్తించడంతో అప్పట్లో రామోజీరావు ఆగ్రహంతో ఈ సినిమా షూటింగ్ కవరేజ్ ఆపివేయాలని ఈనాడు విలేఖర్లకు ఆదేశాలు జారీ చేశాడు. ఆ విధంగా చాలా రోజులపాటు స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ కవరేజ్ ఆగిపోయింది. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే అంటు స్టేట్ రౌడీ షూటింగ్ కవరేజి ఆపేయండి వార్త లేమి కూడా ఈనాడులో రాకూడదు అని ఏకంగా బ్యాన్ కూడా చేశారట. ఉషాకిరణ్ మూవీస్ వారు తెరకెక్కించే సినిమాను కూడా సారధి స్టూడియోస్ లో షూటింగ్ అనుమతించవద్దని కండిషన్ కూడా పెట్టారట.
ఈ విషయం నిర్మాత సుబ్బిరామిరెడ్డికి తెల్సి స్వయంగా రామోజీరావును కలిసి బుజ్జగించిన వెనక్కి తగ్గలేదట.చివరకు కొంతమంది సినీ పెద్దలు కల్పించడంతో ఇక రామోజీరావు శాంతించి ఈనాడులో స్టేట్ రౌడీ గురించి కవర్ చేయడమె కాదు సారధి స్టూడియోలో షూటింగ్ కూడా అనుమతించారట. స్టేట్ రౌడీ మూవీ నైజాం ఏరియాలో కోటి రూపాయల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. నైజాంలో ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించిన తొలి మూవీ స్టేట్ రౌడీ కావడం విశేషం. సినిమా విడుదలై దాదాపుగా 35 ఏళ్లు అవుతున్నప్పటికీ మెగా అభిమానులను ఇప్పటికి ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది.సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ కి ఊహించని రేంజిలో క్రేజ్ ఉండేది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కూడా చెన్నైలో అట్టహాసంగా కన్నులపండువగా జరిగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…