Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే ఆ నాటి వారితో పాటు ఈ జనరేషన్ వారికి కూడా ఎంతో అభిమానం. ఆయన సినిమాలు చూసి ఆనందించని అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. స్వయంకృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం కుర్రాళ్లతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన కెరీర్‌లో కొన్ని సినిమాలు దారుణమైన ఫ్లాపులుగా మారగా, మరి కొన్ని మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే స్టేట్ రౌడీ చిత్రం మాత్రం మొదట్లో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.
స్టేట్ రౌడీ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. 1989 సంవత్సరంలో మార్చి 23న ఈ చిత్రం విడుదల కాగా, ఇందులో చిరంజీవికి జోడీగా రాధా, భానుప్రియ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాకి ఎందుకో కాని మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చింది. కాని తర్వాత దూసుకుపోయింది. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలని వెనక్కి నెట్టి మరీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్ వేర్ ఈజ్ అమితాబచ్చన్ అంటూ చిరంజీవిపై ఆర్టికల్ ను ప్రచురించింది. ఇది అందరిని ఆశ్చర్యపరచింది.
స్టేట్ రౌడీ సినిమా సృష్టించిన ప్రభంజనానికి నిర్మాతలు వంద రోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కు రజినీకాంత్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం చిరంజీవి తన సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.ఆచార్య తేడా కొట్టేసిన తరువాత వెంటనే చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లి చిల్ అయ్యాడు. ఆచార్య కోసం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా దాదాపు 80 శాతం రెమ్యూనరేషన్ వాపస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల గాడ్ ఫాదర్‌తో మంచి విజయం అందుకున్నాడు చిరు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…